Nara Lokesh : అడ్డు కోవాలని చూస్తే తొక్కుకుంటూ వెళ్తాం
వైఎస్ జగన్ పై నిప్పులు చెరిగిన నారా లోకేష్
Nara Lokesh : టీడీపీ నేత నారా లోకేష్ నిప్పులు చెరిగారు. రాజమండ్రిలోని వేమగిరి వేదికగా జరిగిన టీడీపీ మహానాడులో నారా లోకేష్(Nara Lokesh) ప్రసంగించారు. ఏపీ సీఎం జగన్ రెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేశారు. తమను అడ్డుకోలేని చూస్తే తొక్కుకుంటూ వెళతామని హెచ్చరించారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాచరిక పాలన సాగుతోందన్నారు. ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పేందుకు రెడీగా ఉన్నారని జోష్యం చెప్పారు.
రాజమహేంద్రం పేరులోనే రాజసం ఉందన్నారు. గోదావరి నీళ్లు ఎంత స్వచ్చంగా ఉంటాయో ఇక్కడ ప్రజల మనస్సు అంత స్వచ్చంగా ఉంటుందన్నారు నారా లోకేష్. గోదారోళ్ల యటకారం మమకారం రెండూ గొప్పవన్నారు. టీడీపీ పేరు చెబితే పౌరుషం, పసుపు జెండా చూస్తే పూనకం వచ్చి తీరుతుందన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని విజయం సాధించడం తప్పదన్నారు.
తెలుగు జాతిని ప్రపంచానికి పరిచయం చేసిన మూడు అక్షరాల పేరు ఎన్టీఆర్. రాముడైనా, కృష్ణుడైనా, రావణుడైనా అది ఎన్టీఆర్ మాత్రమేనని పేర్కొన్నారు. కష్టం వస్తే ప్రజల కన్నీళ్లు తుడిచింది ఆయనేనన్నారు. దేశంలో ఎన్టీఆర్ పేరు కాదు ప్రభంజనమన్నారు. ఢిల్లీకి తెలుగోడి పవర్ చూపింది ఎన్టీఆరేనని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను గుర్తించి సముచిత స్థానం కల్పించిన ఘనత కూడా నందమూరి తారక రామారావుదేనని పేర్కొన్నారు.
Also Read : Achhennaidu
