Mahanadu Croud : రాజమండ్రిలోని రాజమహేంద్రం వేమగిరి వేదికగా తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడు ఊహించని రీతిలో సక్సెస్ అయ్యింది. పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఊహించని రీతిలో జనం తరలి వచ్చారు. మరోసారి టీడీపీకి ఉన్న పవర్ ఏమిటో తెలియ చేశారు. లక్షలాది మంది మహానాడుకు విచ్చేశారు(Mahanadu Croud). ఎక్కడ చూసినా జనమే జనం. ఇసుక వేస్తే రాలనంత జనం రావడంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందం వెల్లి విరుస్తోంది.
నిన్నటి దాకా అధికార పార్టీ ఆగడాలు, వేధింపులు తాళలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు . మార్పు తథ్యమని చెప్పకనే చెప్పారు. ఇటు తెలంగాణ అటు ఏపీతో పాటు దేశంలోని తెలుగు వారు ప్రత్యేకించి ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో తరలి వచ్చారు. దేశంలోని పలు ప్రాంతాల నుండే కాకుండా విదేశాల నుంచి కూడా మహానాడుకు హాజరయ్యారు. ఇదే సమయంలో భారీ వర్షం కురిసినా అలాగే ఉండి పోయారు .
ఈ సందర్భంగా చంద్రబాబు హాజరైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ పట్ల శ్రేణులకు ఉన్న నిబద్దత ఏపాటిదో తెలిసి పోయిందన్నారు. ఈ అశేష జనవాహినిని చూస్తుంటే ఇక తెలుగుదేశానికి ఢోకా లేదని అనిపిస్తోందన్నారు. ఇదే జోరును రాబోయే ఎన్నికల్లో చూపించాలని కోరారు. తెలుగువాడి సత్తా ఏమిటో జగన్ కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
Also Read : Nara Lokesh
