AP Rains : ఏపీలో వ‌ర్షాలు కురిసే ఛాన్స్

విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ

AP Rains : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజుల పాటు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ వెల్ల‌డించారు. రాష్ట్ర వ్యాప్తంగా అక్క‌డ‌క్క‌డ మోస్త‌రు వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నారు. వ‌ర్షాల‌తో పాటు పిడుగులు ప‌డనున్నాయ‌ని , అంతా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.

ముందు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌సాయ ప‌నులకు వెళ్లే రైత‌న్న‌లు, ప‌ని చేసే కూలీలు, ప‌శువుల‌, గొర్రెల కాప‌రులు చెట్ల కింద ఉండ కూడద‌ని హెచ్చ‌రించారు అంబేద్క‌ర్. ప్ర‌జ‌లు సైతం అల‌ర్ట్ గా ఉండాల‌ని లేక పోతే ప్ర‌మాదం కొని తెచ్చుకునే ఛాన్స్ ఉంద‌న్నారు.

ప్ర‌ధానంగా రాష్ట్రంలోని పార్వ‌తీ పురం మ‌న్యం జిల్లాతో పాటు అల్లూరి సీతారామ రాజు, ఏలూరు, కృష్ణ ఎన్టీఆర్ , గుంటూరు, ప‌ల్నాడు, బాప‌ట్ల‌, తిరుప‌తి, చిత్తూరు , అన్న‌మ‌య్య‌, శ్రీ స‌త్య‌సాయి జిల్లాల్లో అక్క‌డ‌క్క‌డ తేలిక పాటి నుండి ఓ మోస్త‌రు వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపారు డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్. ఇక ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు(Rains) కురుస్తాయ‌ని మిగ‌తా జిల్లాల్లో మాత్రం తేలిక‌పాటి జ‌ల్లులు ప‌డే ఛాన్స్ ఉంద‌న్నారు.

శుక్ర‌వారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామ రాజు, కాకినాడ, కోనసీమ,ఏలూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలిక పాటి జల్లులు పడే అవకాశం ఉంద‌ని తెలిపారు అంబేద్క‌ర్.

Also Read : Meta Threads Comment : థ్రెడ్స్ జోష్ ట్విట్ట‌ర్ షాక్

 

Leave A Reply

Your Email Id will not be published!