CM Chandrababu: పులివెందుల ఉప ఎన్నికలపై చంద్రబాబు ఆశక్తికర వ్యాఖ్యలు
పులివెందుల ఉప ఎన్నికలపై చంద్రబాబు ఆశక్తికర వ్యాఖ్యలు
CM Chandrababu : పులివెందుల ప్రజలు ఇప్పుడిప్పుడే అరాచకం నుంచి బయటపడుతున్నారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో బుధవారం సీఎం చంద్రబాబు (CM Chandrababu) ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా పలువురికి ఆర్థిక సాయం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలపై అడిగిన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానమిచ్చారు.
CM Chandrababu Interesting Comments on Pulivendula ZPTC Elections
‘‘వైయస్ హయాం నుంచి పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగలేదు. ఈసారి అరాచకాలు జరగలేదనే అసహనంతో జగన్ ఉన్నారు. ఆయన వైఖరి ఏలాంటిదో ప్రజలకు తెలిసిందే. నామినేషన్ వేసేందుకే భయపడే పరిస్థితి నుంచి 11 మంది పోటీ చేశారు. రెండు పోలింగ్ బూత్‌ల్లో ఎప్పుడైనా రీపోలింగ్ జరిగిందా?శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉన్నాయి కనుకే ప్రజలు ధైర్యంగా ఓటేశారు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
మరోవైపు రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలపై అప్రమత్తంగా ఉన్నామని సీఎం చంద్రబాబు (CM Chandrababu) తెలిపారు. భారీ వర్షాల కారణంగా పలువురు మరణించడం బాధాకరమన్నారు. నష్ట నివారణకు ఎక్కడికక్కడ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాల్లో సంబంధిత మంత్రులు సమన్వయం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
పులివెందుల ప్రజలకు భయం పోయింది… జగన్‌కు పట్టుకుంది – మంత్రి పయ్యావుల
పులివెందుల ప్రజలకు భయం పోయిందని… అయితే ఆ భయం ఇప్పుడు జగన్‌కు పట్టుకుందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. బుధవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉద్రిక్తతలు సహజమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగున్నాయని చెప్పారు. జగన్ హయాంలో పోలీసులపై అనేక ఒత్తిళ్లు పెట్టారని, తమ ప్రభుత్వంలో ఆ శాఖ స్వచ్ఛందంగా పనిచేస్తోందని పేర్కొన్నారు.
‘‘గతంలో వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డిని సీబీఐ కూడా టచ్ చేయలేకపోయింది. అరెస్టు చేయడం సాధ్యం కాదని గతంలో నివేదికలు పంపారు. కానీ మా ప్రభుత్వంలో కానిస్టేబుల్ వెళ్లి అవినాష్‌రెడ్డిని అడ్డుకున్నారు. వైసీపీ నేతలు ప్రజాస్వామ్యంపై మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది. ప్రజలు, క్యాడర్‌ను రెచ్చగొట్టేందుకు జగన్ అనేక ప్రయత్నాలు చేశారు. పులివెందుల ప్రజలు ధైర్యంగా వచ్చి ఓటేశారు. రేపు వచ్చే ఫలితాలను స్వీకరించేందుకు జగన్ సిద్ధంగా ఉండాలి. అసెంబ్లీ ఫలితాలనే జగన్ ఇంకా స్వీకరించడం లేదు. ఓటమికి కారణాలు వెతుక్కోవడం వైసీపీ నేతలకే చెల్లింది. పోలీసులు సరిగా పనిచేయడాన్ని ఆ పార్టీ భరించలేకపోతోంది. ఓట్ల చోరీకి మూలం వైసీపీనే కదా. ఉరవకొండ, తిరుపతి, విశాఖ, పర్చూరును మర్చిపోయారా?మేం ప్రజలను నమ్ముకున్నాం.. మీరు దొంగ ఓట్లను నమ్ముకున్నారు’’ అని మంత్రి పయ్యావుల వ్యాఖ్యానించారు.
Also Read : Minister Anagani Satyaprasad: కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రి అనగాని ఆశక్తికర వ్యాఖ్యలు