CM KCR : 8 వైద్య క‌ళాశాల‌ల‌కు ప‌చ్చ జెండా

ప్ర‌క‌టించిన బీఆర్ఎస్ ప్ర‌భుత్వం

CM KCR : తెలంగాణ ప్ర‌భుత్వం ఖుష్ క‌బ‌ర్ చెప్పింది. ఇప్ప‌టికే ఉన్న వాటికి కాకుండా అద‌నంగా మ‌రో ఎనిమిది మెడిక‌ల్ కాలేజీల‌ను మంజూరు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ప‌ర్మిష‌న్ ఇస్తూ ఉత్త‌ర్వులు కూడా జారీ చేయ‌డం విశేషం.

ఈ కాలేజీల ఏర్పాటు వ‌ల్ల వైద్య విద్యార్థుల‌కు అద‌నంగా మేలు చేకూర్చ‌నుంది. ఇక రాష్ట్రంలో కొత్త‌గా మంజూరైన మెడిక‌ల్ కాలేజీలు ఈ విధంగా ఉన్నాయి. ఈ కొత్త వైద్య కాలేజీలు జోగులాంబ గ‌ద్వాల , నారాయ‌ణ్ పేట్ , ములుగు, వ‌రంగ‌ల్ , మెద‌క్, యాదాద్రి భువ‌న‌గిరి, రంగారెడ్డి, మేడ్చ‌ల్ మ‌ల్కాజ్ గిరి జిల్లాల్లో ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు సీఎం కేసీఆర్(KCR).

ఇప్ప‌టికే సీఎం కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలోని ప్ర‌తి ప్రాంతంలో (జిల్లా కేంద్రం) ఓ మెడిక‌ల్ కాలేజీని ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. ఆ మేర‌కు చాలా చోట్ల భారీ ఎత్తున ఖ‌ర్చు చేసి వైద్య క‌ళాశాల‌ల‌ను ఏర్పాటు చేసింది. ఇప్ప‌టికే ప‌లు చోట్ల కొత్త వైద్య కాలేజీల‌లో స్టూడెంట్స్ చేరారు. పాఠాల‌తో పాటు ప్రాక్టిక‌ల్స్ కూడా ఫోక‌స్ పెట్టారు. ఇదిలా ఉండ‌గా ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

Also Read : Sourav Ganguly : చాహ‌ల్ పై క‌న్నేసి ఉంచాలి – గంగూలీ

Leave A Reply

Your Email Id will not be published!