ఉస్మానియా ఆస్ప‌త్రి నిర్మాణం ప‌నులు పూర్తి చేయాలి

రోడ్లు , భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్

హైదరాబాద్ : ఉస్మానియా జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రి భ‌వ‌న నిర్మాణం ప‌నులు వ‌చ్చే ఏడాది 2027 నాటికి పూర్తి కావాల‌ని ఆదేశించారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఈ రోజు ఉస్మానియా జనరల్ ఆసుపత్రి భవనానికి సంబంధించిన నిర్మాణ పనులను తనిఖీ చేశారు. వివిధ శాఖల అధికారులు , నిర్మాణ బాధ్యతలు చేపట్టిన సంస్థ (MEIL) ప్రతినిధులతో కలిసి ఆయన ఈ ప్రాజెక్టు పురోగతిని సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ఆసుపత్రి నిర్మాణ ప్రాజెక్టును డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని వికాస్ రాజ్ స్ప‌ష్టం చేశారు. ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తయ్యేలా చూడటానికి, ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. అలాగే, అవసరమైన అన్ని అనుమతులను ‘గ్రీన్ ఛానల్’ విధానం ద్వారా త్వరితగతిన మంజూరు చేస్తామని తెలిపారు.

నిర్ణీత కాల పరిమితిలోగా ప్రాజెక్టు పూర్తి కావాలంటే, ప్రస్తుతం కొనసాగుతున్న పని వేగాన్ని నిలకడగా కొనసాగించాలని ఆయన ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. రోడ్లు , భవనాల శాఖ, జీహెచ్ఎంసీ, వైద్యారోగ్య శాఖ, విద్యుత్ శాఖ , ఇతర సంబంధిత సంస్థల సీనియర్ అధికారులతో పాటు, మెయిల్ ప్రతినిధులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన వారిలో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి పి. ప్రవీణ్య, చీఫ్ ఇంజనీర్ జి. రాజేశ్వర్ రెడ్డి, జోనల్ కమిషనర్ బి. సంతోష్, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్, వైద్య విద్య అదనపు సంచాలకురాలు డాక్టర్ ఎన్. వాణి, మెయిల్ ప్రాజెక్టు విభాగం అధ్యక్షుడు కె. గోవర్ధన్ రెడ్డి, ఉస్మానియా ఆసుపత్రి ప్రాజెక్టు చీఫ్ జనరల్ మేనేజర్ వెనిగళ్ళ శ్రీనివాస్ ఉన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!