Jammu and Kashmir: జమ్మూకశ్మీర్ రాజ్యసభ ఫలితాలు విడుదల
జమ్మూకశ్మీర్ రాజ్యసభ ఫలితాలు విడుదల
Jammu and Kashmir : జమ్మూకశ్మీర్ లో 370వ అధికరణ రద్దు తర్వాత రాజ్యసభకు తొలిసారి శుక్రవారంనాడు జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగగా… ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని అధికార నేషనల్ కాన్ఫరెన్స్ 3 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. నాలుగో సీటును బీజేపీ దక్కించుకుని తమ ఉనికిని చాటుకుంది. మొత్తం 88 మంది ఎమ్మెల్యేలలో 86 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిర్బంధంలో ఉన్న ఎమ్మెల్యే మెహ్రాజ్ మాలిక్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. శ్రీనగర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కాంప్లెక్స్‌లో పోలింగ్ జరుగగా, సాయంత్రం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించారు.
Jammu and Kashmir – విజేతలు వీరే
జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC) నుంచి ముగ్గురు విజేతలుగా నిలిచారు. చౌదరి మహమ్మద్ రంజాన్ మొదటి రాజ్యసభ సీటును గెలుచుకోగా, రెండో సీటును సజ్జాద్ అహ్మద్ కిచ్లూ, మూడో రాజ్యసభ సీటును జీఎస్ (షమ్మీ) ఒరెరాయ్ గెలుచుకున్నారు. ఈ మూడు సీట్లనూ ఎన్సీ సునాయాసంగా గెలుచుకోగా, నాలుగో సీటుకు పోటీ నెలకొంది. ఈ సీటుకు ఎన్సీ అభ్యర్థి ఇమ్రాన్ నబి దర్, బీజేపీ నేత సత్ శర్మ పోటీ పడగా, బీజేపీ అభ్యర్థి 32 ఓట్లతో గెలుపొందారు. జమ్మూకశ్మీర్ నుంచి రాజ్యసభకు జరిగిన ఎన్నికల్లో 4 స్థానాల్లో 3 సీట్లు గెలుచుకోవడంతో ఎన్సీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బీజేపీ కార్యకర్తలు సైతం ఒక రాజ్యసభ సీటు గెలుచుకోవడంతో సంబరాలు చేసుకున్నారు.
Also Read : CM Revanth Reddy: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం
