చెన్నై : తమిళనాడులో కొత్తగా కొలువు తీరిన సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ఇప్పుడు సంచలనంగా మారారు. ఆయన దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యారు. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. వచ్చీ రావడంతోనే ఎలాంటి భేషజాలు లేకుండా పాలనపై ముద్ర వేశారు. అంతే కాదు అవినీతి రహిత పాలన అందిస్తానని ప్రకటించాడు. ఆపై ఇచ్చిన హామీలకు సంబంధించి కుర్చీ మీద కూర్చోగానే సంతకాలు చేశాడు. ఆపై అందరికీ షాక్ ఇస్తూ ప్రజలకు మేలు చేకూర్చేలా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆయా ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు, విద్యా సంస్థలకు దగ్గరలో ఉన్న మద్యం రిటైల్ అవుట్ లెట్లను వెంటనే మూసి వేయాలని ఆర్డర్ పాస్ చేశాడు.
ఇదిలా ఉండగా సీఎం జోసెఫ్ చంద్రశేఖర్ విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల దేశ వ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. ఆయన పూర్తిగా ప్రజల మనిషిగా, సాధారణమైన జీవితాన్ని గడిపేందుకు ఇష్ట పడుతున్నాడు. ప్రస్తుతం తమిళనాడులో ఎలాంటి కులాలు, మతాలు, విద్వేష పూరితాలకు తావు ఇవ్వకుండా పాలనా పరంగా చర్యలు చేపట్టారు. తాజాగా ఆయనకు సంబంధించిన ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది. తాను ఇంటి నుంచే భోజనం తెచ్చుకోవడం, ఆఫీసులో తినడం అందరినీ విస్తు పోయేలా చేసింది. ప్రజలకు చెప్పే ముందు తాను చేసి చూపిస్తానని ప్రకటించారు. ఆపై ఇంకో సంచలన ప్రకటన చేశాడు. గత డీఎంకే ప్రభుత్వంలో ప్రజలకు మేలు చేసిన సంక్షేమ పథకాలను రద్దు చేయబోనని, వాటిని అమలు చేస్తానని వెల్లడించాడు. దీంతో తను ప్రజల సీఎంగా గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.