ఒక్క‌డితో మొద‌లైన జ‌న‌సేన 21 ల‌క్ష‌ల‌కు చేరుకుంది

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి : కేవ‌లం ప్ర‌జ‌ల బాగు కోసం తాను ఒక్క‌డినే ఏర్పాటు చేసిన జ‌నసేన ఇవాళ 21 .5 ల‌క్ష‌ల మందికి చేరుకోవ‌డం ఆనందంగా ఉంద‌న్నారు ఏపీ డిప్యూటీ సీఎం , జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. ఏపీ, తెలంగాణలోనే కాకుండా కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, యూపీ వంటి ప్రాంతాల్లో కూడా న‌న్ను న‌మ్మి పార్టీలో చేరడం ఆనందంగా ఉంద‌న్నారు. త‌న ల‌క్ష్యం ఒక్క‌టేన‌ని, అది ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ వారికి సేవ చేయ‌డమేన‌ని స్ప‌ష్టం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. అంతే కాదు కేవ‌లం నా కోసం పని చేయడం కోసం దాదాపు 10 వేల మందికి పైగా ఉద్యమి సభ్యత్వం తీసుకున్నారని వెల్ల‌డించారు.

జనసేన భావజాలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదన్నారు. అది దేశ వ్యాప్తంగా విస్త‌రిస్తుంద‌న్నారు. ఆ న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు ప‌వ‌న్ క‌ల్యాణ్ కొణిద‌ల‌. మనది జాతీయ సమగ్రత, జాతీయ భావాలు ఉన్న పార్టీ అని ప్ర‌కటించారు. ఆనాడు 150 మందితో ప్రారంభమైన ఈ పార్టీ ఉద్యమం, నేడు 22 లక్షల మందికి విస్తరించింద‌న్నారు . జనసేన పోరాటం కేవలం ప్రజా సమస్యల పైనే ఆధారపడి ఉందని నొక్కి చెప్పారు. నూతనంగా చేరేవారిని మనస్ఫూర్తిగా ఆహ్వానించడం ద్వారా మాత్రమే పార్టీ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. నాయకత్వాన్ని తీర్చి దిద్దుకోవడానికి స్థానిక సంస్థల ఎన్నికలు ఒక గొప్ప అవకాశం అని అన్నారు. పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ‘సాధక్’ (కార్యకర్త) కీలక పాత్ర పోషించార‌ని ప్ర‌శంసించారు .

Leave A Reply

Your Email Id will not be published!