కుకు టీవీలో ఎంఎస్ ధోనీ పెట్టుబ‌డి

ఏఐ ఆధారిత స్టోరీ టెల్లింగ్ ప్లాట్ ఫామ్

చెన్నై : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ అద్భుత‌మైన క్రికెట‌ర్ గా గుర్తింపు పొందాడు. ఇదే స‌మ‌యంలో త‌ను మంచి వ్యాపార‌వేత్త కూడా. సంవ‌త్స‌రానికి భారీ ఎత్తున ఆదాయం పొందుతున్నాడు. టాప్ కంపెనీల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా, ప్ర‌మోట‌ర్ గా, ఇన్వెస్ట‌ర్ గా త‌ను పేరు పొందాడు. తాజాగా ఏఐ-ఆధారిత స్టోరీటెల్లింగ్ ప్లాట్‌ఫామ్ కుకు టీవీలో ఎంఎస్ ధోని పెట్టుబడిదారుగా చేరారు. ఈసంద‌ర్భంగా కుకు టీవీ కో ఫౌండ‌ర్ వినోద్ కుమార్ మీనా ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు. దేశ వ్యాప్తంగా అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ప్ర‌ముఖుల‌లో ధోనీ ఒక‌రు అని పేర్కొన్నారు. ఆయ‌న త‌మ సంస్థ‌లో పెట్టుబ‌డి పెట్ట‌డం త‌మ‌కు ఎంతో గ‌ర్వ కార‌ణంగా ఉంద‌న్నాడు.

ఇదిలా ఉండ‌గా భారత దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోని కుకు టీవీలో పెట్టుబడి పెట్టడమే కాకుండా, దాని షార్ట్స్ , డ్రామా యాప్ అయిన కుకు టీవీకి బ్రాండ్ అంబాసిడర్‌గా చేరారు. ఈ భాగస్వామ్యంపై ధోని స్పందించాడు. నేను కుకు టీవీలో పెట్టుబడి పెట్టడానికి ,టీవీకి అంబాసిడర్‌గా చేరడానికి ఎంచుకున్నాను, ఎందుకంటే ఈ ప్లాట్‌ఫామ్ నన్ను నిజంగా ఆకట్టుకుంది. ఇది భారతదేశం అంతటా ప్రేక్షకులకు బహుళ భాషలు , ఫార్మాట్‌లలో విభిన్నమైన వినోద అనుభవాన్ని అందించింది. దీని వృద్ధి అద్భుతంగా ఉంది, నా లాంటి చిన్న పట్టణాల నుండి వచ్చి ఇంతటి స్థాయిలో ఒక సంస్థను నిర్మించిన వ్యవస్థాపకులతో నేను బలంగా మమేకమవుతానని ప్ర‌క‌టించాడు.

Leave A Reply

Your Email Id will not be published!