ధర్మశాల : ఐపీఎల్ 19 మెగా టోర్నీ ఆరంభంలో అదుర్స్ అనిపించింది శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని పంజాబ్ కింగ్స్ ఎలెవన్. కానీ రెండో సీజన్ లో మాత్రం ఆ జట్టు చేతులెత్తేసింది. వరుసగా ఐదోసారి ఓడి పోయింది. దీంతో ప్లే ఆఫ్స్ కు చేరాలంటే ఇంకా జరగాల్సిన రెండు మ్యాచ్ లలో భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. నిన్న ధర్మశాల వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో పంజాబ్ ను ఉతికి ఆరేశారు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు. ముందుగా బ్యాటింగ్ చేసింది పంజాబ్ కింగ్స్ ఎలెవన్. నిర్ణీత 20 ఓవర్లలో 200 రన్స్ చేసింది. అనంతరం బరిలోకి దిగింది ముంబై ఇండియన్స్. ఓపెనర్ రెకెల్టన్ ఆకాశమే హద్దుగా చెలరేగితే ఆ తర్వాత రోహిత్ శర్మ, కెన్ రూథర్ ఫోర్డ్ , వోక్స్ దుమ్ము రేపారు.
ఇక తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మరోసారి రెచ్చి పోయాడు. పంజాబ్ బౌలర్ల భరతం పట్టాడు. 15 ఓవర్ల వరకు పంజాబ్ చేతిలో ఉన్న మ్యాచ్ ను లాగేసుకు పోయాడు. అద్భుతమైన ఆట తీరుతో దుమ్ము రేపాడు. కేవలం 33 బాల్స్ మాత్రమే ఎదుర్కొని 6 ఫోర్లు 6 సికర్లతో విద్వంసం సృష్టించాడు. దీంతో ఇంకా బంతులు మిగిలి ఉండగానే గెలుపు జెండా ఎగుర వేసింది. అయితే ఆ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. కానీ పోతూ పోతూ పంజాబ్ ఆశలపై నీళ్లు చల్లింది. ఇప్పటి వరకు పంజాబ్ కింగ్స్ 12 మ్యాచ్ లు ఆడింది. 13 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు , గుజరాత్ టైటాన్స్ 12 మ్యాచ్ల నుండి చెరో 16 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ , రాజస్థాన్ రాయల్స్ రెండూ 11 మ్యాచ్ల నుండి 12 పాయింట్లతో పంజాబ్ కు దగ్గరలో ఉన్నాయి. ఇవాళ లక్నోతో గెలిస్తే చెన్నై 4వ స్తానానికి చేరుకుంటుంది.