Revanth Reddy : కేసీఆర్ కుటుంబాన్ని సాగనంపాలి
పిలుపునిచ్చిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
Revanth Reddy : తెలంగాణ – రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఒకరిపై మరొకరు మాటలతో మంటలు రేపుతున్నారు. ప్రత్యేకించి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ బాస్ , సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ రెచ్చి పోయి మాట్లాడుతున్నారు. ప్రత్యేకించి చెప్పు కోవాల్సింది రేవంత్ రెడ్డి గురించి.
Revanth Reddy Comments on KCR
ఆయన మాట్లాడుతున్న తీరు సభ్య సమాజం తల దించుకునేలా ఉందని బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. పరాజయం భయంతో హింసను ప్రేరేపించేలా ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదని సూచించించి పార్టీ.
ఈసారి కాంగ్రెస్ పార్టీ గెలవక పోతే యువతీ యువకులు అడవి బాట పట్టడం ఖాయమని పదే పదే చెబుతూ వస్తున్నారు. ఒకవేళ వారంతా నక్సలైట్లుగా మారితే ఈ ప్రభుత్వంలో ఒక్కడు కూడా మిగలడంటూ హెచ్చరించారు.
ప్రత్యేకించి సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేయడం ఒకింత ఆశ్చర్య పోయేలా చేస్తోంది రేవంత్ రెడ్డి(Revanth Reddy) తీరు. ప్రగతి భవన్ ను బాంబులు పెట్టి పేల్చేస్తామన్నారు. ఈ ఎన్నికల్లో కేసీఆర్ తల నరకాల్సిందేనని అన్నారు రేవంత్ రెడ్డి.
మీడియా ఛానల్ నా కొడుకులను పండ పెట్టి తొక్కి పేగులు తీస్తానంటూ అహంకార పూరితంగా మాట్లాడాడంటూ మండిపడ్డారు. ఈసారి ఎన్నికల్లో కేసీఆర్ తల నరకాల్సిందేనంటూ పిలుపునిచ్చారు.
Also Read : PM Modi : జయహో భారత్ – మోదీ
