తిరుపతి : అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండల సమీపంలోని తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 24 నుండి మార్చి 05వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ఫిబ్రవరి 23వ తేదీన సాయంత్రం 6 గం.లకు అంకురార్పణ నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. అందులో భాగంగా ఆలయ పరిసరాలలో చలువ పందిళ్లు, రంగోళీలు, క్యూలైన్లు, బారీకేడ్లు, ఆలయం, మాడ వీధుల్లో శోభాయమానంగా విద్యుత్, పుష్పాలంకరణలను చేపట్టారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 8 నుండి 10 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల వివరాలు ఇలా ఉన్నాయి. 24న ఉదయం ధ్వజారోహణం (ఉదయం 8 నుండి 9.00 గంటల మధ్య మీన లగ్నంలో), రాత్రి హంస వాహనం నిర్వహిస్తారు.
25న ఉదయం ముత్యపు పందిరి వాహనం, రాత్రి హనుమంత వాహనం, 26న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సింహ వాహనం, 27న ఉదయం తిరుచచ్చి ఉత్సవం, రాత్రి పెద్ద శేష వాహనం, 28న తిరుచ్చి ఉత్సవం, రాత్రి గజ వాహనంపై స్వామి అనుగ్రహిస్తారు. ఇదేక్రమంలో మార్చి 1న ఉదయం తిరుచ్చి ఉత్సవం, రాత్రి సర్వ భూపాల వాహనం (సాయంత్రం 4.30 నుండి 6 గంటల వరకు) కల్యాణోత్సవం (రాత్రి 8 నుండి 10 గంటల వరకు), గరుడ వాహనం( రాత్రి 11 నుండి), 2వ తేదీన ఉదయం రథోత్సవం, రాత్రి ధూళి ఉత్సవం, 3న ఉదయం సూర్య ప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం (రాత్రి 08.30 నుండి 09.30గం.ల వరకు), పార్వేట ఉత్సవం ( రాత్రి 09.30 – 10.00 గంటల వరకు), అశ్వ వాహనం (రాత్రి 10.00 నుండి 11.30 గంటల వరకు), 4న ఉదయం వసంతోత్సవం (ఉదయం 7 నుండి 8 గంటల వరకు), చక్రస్నానం (ఉదయం 11.30 గంటలకు), రాత్రి ధ్వజావరోహణం. ( రాత్రి 8 గంటలకు), మార్చి 5న సాయంత్రం 5.30 నుండి రాత్రి 8 గంటల వరకు పుష్పయాగం నిర్వహించనున్నారు.
