Tirumala : శ్రీ‌వారి ఆదాయం రూ. 3.93 కోట్లు

ద‌ర్శించుకున్న యాత్రికులు 77,299

Tirumala : కోరిన కోర్కెలు తీర్చే తిరుమ‌ల పుణ్య క్షేత్రానికి భ‌క్తుల తాకిడి మ‌రింత పెరుగుతోందే త‌ప్పా త‌గ్గ‌డం లేదు. భ‌క్తులు స‌మ‌ర్పిస్తున్న కానుక‌లు, విరాళాల‌తో స్వామి వారి హుండీ ఆదాయం నిండుతోంది. ఇక వేస‌వి సెల‌వులు పూర్త‌యినా , రుతు ప‌వ‌నాలతో తాకిడితో భారీ వ‌ర్షాలు కురుస్తున్నా భ‌క్తులు మాత్రం తిరుమ‌ల దారి ప‌ట్టారు.

నిన్న ఒక్క రోజే ఏకంగా శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను 77 వేల 299 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. ఇక స్వామి వారికి త‌ల నీలాలు స‌మ‌ర్పించుకున్న భ‌క్తులు కూడా పెరిగారు. 30 వేల 479 మంది త‌ల నీలాలు ఇచ్చారు. ఇక భ‌క్తులు అందించిన కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.93 కోట్లు వ‌చ్చిన‌ట్లు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (TTD) వెల్ల‌డించింది.

ఇక స్వామి వారి ద‌ర్శ‌నం కోసం సుదూర ప్రాంతాల నుంచి వ‌చ్చిన భ‌క్తులు తిరుమ‌ల లోని కంపార్ట్ మెంట్ల‌లో వేచి ఉన్నారు. మొత్తం 21 కంపార్ట్ మెంట్ల‌లో నిండి పోయారు. ఇదిలా ఉండ‌గా స‌ర్వ ద‌ర్శ‌నం అంటే టోకెన్లు తీసుకోని భ‌క్తులకు శ్రీ‌వారి , అమ్మ వారి ద‌ర్శ‌నం కోసం వేచి ఉన్నారు. వీరికి ద‌ర్శ‌న స‌మ‌యం 18 గంట‌లు ప‌డుతుంద‌ని అంచ‌నా వేసింది టీటీడీ.

ఇదిలా ఉండ‌గా త‌ర‌లి వ‌చ్చిన భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా చ‌ర్య‌లు చేప‌ట్టింది టీటీడీ. ఈ మేర‌కు భ‌క్తుల‌కు అందుతున్న సౌక‌ర్యాల గురించి టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డి ప‌ర్య‌వేక్షించారు.

Also Read : Vijay Sai Reddy : విజ‌య‌సాయి రెడ్డికి సుప్రీం నోటీస్

Leave A Reply

Your Email Id will not be published!