Eknath Shinde : మ‌రఠ్వాడా ప్రాంత‌పు అభివృద్దిపై ఫోక‌స్

ప్ర‌క‌టించిన మ‌రాఠా సీఎం ఏక్ నాథ్ షిండే

Eknath Shinde :  రాష్ట్రంలోని మ‌రఠ్వాడా ప్రాంతంలో త‌మ ప్ర‌భుత్వం ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతుంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం ఏక్ నాథ్ షిండే. ఈ ప‌నుల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్ష చేస్తామ‌ని చెప్పారు సీఎం.

ఔరంగాబాద్ న‌గ‌రంలో శ‌నివారం చేప‌ట్టిన హైద‌రాబాద్ విమోచ‌న దినోత్స‌వం వార్షికోత్స‌వ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యారు. ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర వేశారు.

మరఠ్వాడా ముక్తీ సంగ్రామ్ దిన్ ను నిర్వ‌హిస్తున్నారు. హైద‌రాబాద్ ను భార‌త దేశంలో విలీనం చేసేందుకు నిజాంను భార‌త సైన్యం ఓడించిన త‌ర్వాత మ‌రాఠ్వాడా విలీనం అయిన వార్షికోత్స‌వాన్ని సూచించింది.

ఈ సంద‌ర్భంగా ఏక్ నాథ్ షిండే ప్ర‌సంగించారు. మ‌ర‌ఠ్వాడా ప్రాంతంలో ప్ర‌భుత్వం ప‌లు అభివృద్ది ప‌నులను చేప‌ట్టింద‌ని చెప్పారు. ఈ ప‌నులు మ‌రింత త్వ‌రిత‌గ‌తిన పూర్త‌య్యేందుకు కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు సీఎం(Eknath Shinde).

ఎల్లోరా లోని ఘ్ర‌ష్ణేశ్వ‌ర ఆల‌యంలో అభివృద్ది ప‌నులు చేప‌డ‌తామ‌న్నారు. స్పోర్ట్స్ యూనివ‌ర్శిటీ ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు.

ఔరంగాబాద్ లోని పైథాన్ గార్డెన్ , మ్యూజియం పున‌రుద్ద‌ర‌ణ‌, జ‌ల్నా, నీటి పైప్ లైన్ ప‌థ‌కాల అమ‌లుకు ప్ర‌భుత్వం సానుకూలంగా ఉంద‌న్నారు.

ఔరంగాబాద్ లో శివ‌సేన పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు బాల్ థాక‌రే స్మార‌క నిర్మాణ ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని ఆదేశించారు సీఎం. 1948 సెప్టెంబ‌ర్ 17 దాకా నిజాం పాల‌న‌లో ఉండేవి తెలంగాణ‌, మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌.

క‌రువు ప‌రిస్థితుల నుండి ఈ ప్రాంత స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించేందుకు స‌ముద్రంలోకి పోయే నీటిని మ‌ర‌ఠ్వాడాకు మ‌ళ్లించే ప్రాజెక్టును చేప‌ట్ట‌డం జరిగింద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం.

Also Read : ఓట్ల కోస‌మే విమోచ‌న దినోత్స‌వం జ‌రుప‌లేదు

Leave A Reply

Your Email Id will not be published!