Attack On Mangli : క‌న్న‌డ నాట మంగ్లీ కారుపై దాడి

త‌ప్పించుకున్న సింగ‌ర్

Attack On Mangli : ప్ర‌ముఖ బ‌హు భాషా గాయ‌ని మంగ్లీ ప్రాణాపాయం నుంచి త‌ప్పించుకున్నారు. ఆమె ప్ర‌యాణం చేస్తున్న కారుపై కొంద‌రు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు దాడికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క రాష్ట్రంలోని బ‌ళ్లారి సిటీలో చోటు చేసుకుంది. అక్క‌డి పుర‌పాలిక కాలేజీ గ్రౌండ్ లో బ‌ళ్లారి ఫెస్టివ్ సంద‌ర్భంగా జ‌రిగిన ప్రోగ్రాంలో పాల్గొన్నారు సింగ‌ర్ మంగ్లీ(Attack On Mangli).

కార్య‌క్ర‌మం పూర్త‌య్యేంత దాకా ఎవ‌రూ ఏమీ అన‌లేదు. కానీ వెళ్లి పోతున్న త‌రుణంలో సింగ‌ర్ జ‌ర్నీ చేస్తున్న కారుపై దాడి చేసేందుకు య‌త్నించారు. దీంతో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేద‌ని, ప్రాణా పాయం నుంచి త‌ప్పించుకుంద‌ని స‌మాచారం.

ఇదిలా ఉండ‌గా క‌న్న‌డ నాట ప్ర‌త్యేకించి బ‌ళ్లారిలో అత్య‌ధికంగా ఫ్యాన్స్ ఉన్నారు దివంగ‌త న‌టుడు పునీత్ రాజ్ కుమార్ కు. ఇదిలా ఉండ‌గా బ‌ళ్లారి ఫెస్టివ‌ల్ కోసం ప్ర‌త్యేక ఆహ్వానితులుగా సీనియ‌ర్ నటుడు రాఘవేంద్ర రాజ్ కుమార్ , పునీత్ భార్య అశ్విని పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి సింగ‌ర్ మంగ్లీతో పాటు ఇత‌ర కొంద‌రు గాయ‌నీ గాయ‌కులు హాజ‌ర‌య్యారు.

ఇదిలా ఉండ‌గా సింగ‌ర్ మంగ్లీ(Attack On Mangli) ఊపుతో పాట‌లు కూడా పాడంది. అయితే ఆమెను చూసేందుకు, క‌లిసి మాట్లాడేందుకు యువ‌కులు చుట్టు ముట్టారు. వేదిక‌పై ఉన్న టెంట్ వ‌ద్ద‌కు దూసుకు వెళ్లేందుకు ట్రై చేశారు. దీంతో అక్క‌డే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు.

ప్ర‌స్తుతం మంగ్లీ క్షేమంగా ఉన్నార‌ని పోలీసులు తెలిపారు. బ‌ళ్లారి నుంచి హైద‌రాబాద్ కు భారీ భ‌ద్ర‌త మ‌ధ్య త‌ర‌లించారు.

Also Read : ప‌ఠాన్ పై నిర‌స‌న షారుఖ్ ఆందోళ‌న

Leave A Reply

Your Email Id will not be published!