PM Modi : సిద్దిరామ‌య్యపై భ‌గ్గుమ‌న్న మోదీ

పేద‌ల‌ను ఎందుకు దూరం చేశార‌ని ప్ర‌శ్న‌

PM Modi : ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఆయ‌న మ‌రోసారి క‌ర్ణాట‌క మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య‌పై మండిప‌డ్డారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా శ‌నివారం క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరులో ప్ర‌ధాన‌మంత్రి(PM Modi)  భారీ రోడ్ షో చేప‌ట్టారు. అనంత‌రం జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో న‌రేంద్ర మోదీ ప్ర‌సంగించారు. ఆయ‌న కాంగ్రెస్ పార్టీని ల‌క్ష్యంగా చేసుకున్నారు. త‌మ ప్ర‌భుత్వం అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను ఆదుకుంద‌న్నారు న‌రేంద్ర మోదీ.

మాజీ సీఎం బాదామిలో ఓట‌ర్ల‌ను ఆయ‌న అడిగారు. ఇప్ప‌టి దాకా ప్రాతినిధ్యం వ‌హించిన సిద్ద‌రామ‌య్య ఏం చేశాడ‌ని నిల‌దీయాల‌ని పిలుపునిచ్చారు ప్ర‌ధాన‌మంత్రి. త‌మ ఆస్తుల‌ను పెంచుకున్నారే త‌ప్పా రాష్ట్ర అభివృద్ది గురించి ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌న్నారు . తాము ఎన్నో ప‌థ‌కాల‌ను, కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేసిన ఘ‌న‌త త‌మ స‌ర్కార్ దేన‌ని పేర్కొన్నారు.

గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో భారీ ఎత్తున నిధుల‌ను మంజూరు చేశామ‌ని స్ప‌ష్‌టం చేశారు న‌రేంద్ర మోదీ. సిద్ద‌రామ‌య్య మాట‌లు చెప్ప‌డంలో, త‌మ‌ను విమ‌ర్శించ‌డంలో ముందంజ‌లో ఉన్నాడ‌ని ఎద్దేవా చేశారు. ఇప్ప‌టి దాకా ఏం చేశారో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని ప్ర‌ధాన‌మంత్రి(PM Modi)  డిమాండ్ చేశారు.

2018లో సిద్ద‌రామ‌య్య 1,696 ఓట్ల తేడాతో బీజేపీకి చెందిన బి. శ్రీ‌రాముల‌ను ఓడించి బాదామిలో గెలుపొందారు. కాగా తాను పోటీ చేసిన రెండో స్థానం చాముండేశ్వ‌రి నుండి ఓడి పోయారని గుర్తు చేశారు మోదీ. ఈ సారి ఎన్నిక‌ల్లో త‌న కుమారుడు యతీంత్ర సిద్ద‌రామ‌య్య ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వ‌రుణ నుంచి సిద్ద‌రామ‌య్య బ‌రిలో నిలిచాడు.

Also Read : క‌న్న‌డ నాట కాషాయ రెప‌రెప‌లు

Leave A Reply

Your Email Id will not be published!