రాజస్తాన్ రాయల్స్ స్టార్ క్రికెటర్ జోస్ బట్లర్ కు బిగ్ షాక్ తగిలింది. ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా కోల్ కతా నైట్ రైడర్స్ తో కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 రన్స్ చేసింది.
అనంతరం బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 13.1 ఓవర్లలోనే 150 రన్స్ టార్గెట్ ఛేదించింది. కేవలం ఒకే ఒక్క వికెట్ కోల్పోయింది భారీ టార్గెట్ ను అవలీలగా ఛేదించింది. యంగ్ స్టార్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ శివమెత్తి ఆడాడు. 47 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు 5 సిక్సర్లతో రెచ్చి పోయాడు. 98 పరుగులు చేశాడు. కెప్టెన్ శాంసన్ 29 బంతులు ఎదుర్కొని 47 రన్స్ చేశాడు.
ఇదిలా ఉండగా 31 పరుగుల వద్ద ఉండగా లేని పరుగు కోసం వెళ్లారు ఇద్దరూ ప్లేయర్లు యశస్వి జైశ్వాల్ , జోస్ బట్లర్. ఆండ్రూ రస్సెల్ నేరుగా బంతిని వికెట్లకు విసరడంతో రనౌట్ గా పెవిలియన్ దారి పట్టాడు జోస్ బట్లర్. గోల్డెన్ డకౌట్ అయ్యాయి. అయితే ఊహించని రీతిలో టాప్ ఫామ్ లో ఉన్న జోస్ బట్లర్ అనుకోని రీతిలో రనౌట్ కావడం తట్టుకోలేక పోయాడు.
దీంతో గ్రౌండ్ లో బ్యాట్ ను బలంగా నేలకేసి బాదాడు. ఇలా చేయడం ఐపీఎల్ 2.0 రూల్స్ కు విరుద్దమని స్పష్టం చేసింది క్రమశిక్షణ కమిటీ. ఈ మేరకు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. దీనికి ఓకే చెప్పినట్లు ఐపీఎల్ తెలిపింది.
