ముంబై వేదికగా జరిగిన కీలక సమరంలో చివరకు ముంబై ఇండియన్స్ దే పై చేయి అయింది. మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 218 పరుగులతో భారీ స్కోర్ చేసింది. అటు బౌలింగ్ లో ఇటు బ్యాటింగ్ లో దుమ్ము రేపాడు ఆఫ్గనిస్తాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ . ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. కళ్లు చెదిరే షాట్స్ తో దంచి కొట్టాడు. ఓ వైపు సూర్య కుమార్ యాదవ్ సెంచరీతో రెచ్చి పోతే మరో వైపు రషీద్ ఖాన్ ఊహించని రీతిలో షాక్ ఇచ్చాడు.
219 పరుగుల భారీ టార్గెట్ ను ఛేదించడంలో గుజరాత్ తేలి పోయిందని అనుకున్నారంతా . కానీ రషీద్ ఖాన్ రూపంలో విధ్వంసకరమైన ఇన్నింగ్స్ తో ముంబై ఇండియన్స్ జట్టులో వణుకు పుట్టించాడు రషీద్ ఖాన్. కేవలం 32 బంతులు ఎదుర్కొన్న ఈ ఆల్ రౌండర్ 3 ఫోర్లు 10 సిక్సర్లతో రెచ్చి పోయాడు. 79 రన్స్ తో రషీద్ ఖాన్ విధ్వంసం సృష్టించాడు.
ఇదిలా ఉండగా ముంబై విధించిన లక్ష్య ఛేదనలో 13 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ స్కోర్ 8 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. భారీ పరుగుల తేడాతో ఓడి పోతుందని భావించారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రషీద్ ఖాన్ శివమెత్తాడు. దీంతో 8 వికెట్లు కోల్పోయి 191 రన్స్ చేసింది ముంబై ఇండియన్స్. డేవిడ్ మిల్లర్ 41 రన్స్ తో రాణించాడు.
మిగతా టాప్ బ్యాటర్లు నిరాశ పరిచారు. ముంబై బౌలర్లలో మధ్వాల్ 3 వికెట్లు తీస్తే చావ్లా 2, కార్తికేయ 2 , బెహ్రాన్ డార్ఫ్ ఒక వికెట్ తీశారు. ఐపీఎల్ లో సూర్య కుమార్ యాదవ్ తొలి సెంచరీ సాధించాడు. 103 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. రోహిత్ శర్మ 29 , ఇషాన్ కిషన్ 31 , విష్ణు వినోద్ 30 దంచి కొట్టారు.
