Surya Kumar Yadav : చిత‌క్కొట్టిన సూర్య కుమార్ యాద‌వ్

గుజ‌రాత్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు

ముంబై వేదిక‌గా వాంఖ‌డే స్టేడియంలో జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియ‌న్స్ , గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్ల మ‌ధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోరు కొన‌సాగింది. డిఫెండింగ్ ఛాంపియ‌న్ గుజ‌రాత్ చివ‌రి దాకా పోరాడింది. ఒకానొక ద‌శ‌లో 8 వికెట్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న ఆ జ‌ట్టుకు ఊహించ‌ని రీతిలో గెలుపు అంచుల దాకా తీసుకు వ‌చ్చాడు ఆఫ్గ‌నిస్తాన్ ఆల్ రౌండ‌ర్ ర‌షీద్ ఖాన్. 32 బాల్స్ 3 ఫోర్లు 10 సిక్స‌ర్ల‌తో దుమ్ము రేపాడు.

మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ కు దిగింది ముంబై ఇండియ‌న్స్. ఇషాన్ కిష‌న్, కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఐపీఎల్ 16వ సీజ‌న్ లో ఊహించ‌ని రీతిలో ముంబై పుంజుకుంది. ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. పాయింట్ల ప‌ట్టిక‌లో 3వ స్థానానికి చేరుకుంది. రోహిత్ 29 ర‌న్స్ చేస్తే ఇషాన్ కిష‌న్ 31 ర‌న్స్ తో రాణించారు. కెప్టెన్ ఔట్ అయ్యాక క్రీజులోకి వ‌చ్చిన సూర్య కుమార్ యాద‌వ్ ( సూర్య భాయ్) దుమ్ము రేపాడు. ఐపీఎల్ లో తొలి సెంచ‌రీ చేశాడు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. స్టేడియం న‌లు వైపులా క‌ళ్లు చెదిరే షాట్స్ తో దంచికొట్టాడు.

సూర్య కుమార్ యాద‌వ్ 49 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు సిక్స‌ర్ల‌తో 103 ర‌న్స్ తో నాటౌట్ గా నిలిచాడు. అత‌డితో పాటు విష్ణు వినోద్ సైతం రాణించాడు. 30 ప‌రుగులు చేశాడు. కీల‌క పాత్ర పోషించాడు. లాస్ట్ బాల్ ను సిక్స‌ర్ కొట్టి సెంచ‌రీ పూర్తి చేశాడు సూర్య కుమార్ యాద‌వ్. 5 వికెట్లు కోల్పోతే ఒక్క గుజ‌రాత్ బౌల‌ర్ ర‌షీద్ ఖాన్ 30 ప‌రుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు.

Leave A Reply

Your Email Id will not be published!