Nara Lokesh : డిజిట‌ల్ మీడియాను గుర్తిస్తాం – లోకేష్

వారిని జ‌ర్న‌లిస్టులుగా పరిగ‌ణిస్తాం

Nara Lokesh : ప్రింట్, ఎలక్ట్రానిక్ రంగాల‌తో డిజిట‌ల్ మీడియాను కూడా గుర్తిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్(Nara Lokesh). యువ గ‌ళం పాద‌యాత్ర శ‌నివారం బ‌న‌గానప‌ల్లికి చేరుకుంది. ఈ సంద‌ర్బంగా కీల‌క అంశాల‌పై ఆయ‌న అభిప్రాయాలు వ్య‌క్తం చేశారు. రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు. నిజాలు రాసే వారిపై వేధింపుల‌కు పాల్ప‌డ‌డం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

ఇటీవ‌ల యూట్యూబ్ ఛాన‌ళ్లు కూడా ఆద‌ర‌ణ పొందుతున్నాయ‌ని, వాటిని కూడా తాము ప‌వ‌ర్ లోకి వ‌స్తే గుర్తిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. వారిని జ‌ర్న‌లిస్టులుగా ప‌రిగణిస్తామ‌ని, టిడ్కో ఇళ్ల‌ను కేటాయిస్తామ‌ని హామీ ఇచ్చారు నారా లోకేష్. టంగుటూరులో యువ నాయ‌కుడిని చూసేందుకు జ‌నం త‌ర‌లి వ‌చ్చారు. వివిధ వ‌ర్గాల‌తో స‌మావేశం అయ్యారు. వారి స‌మ‌స్య‌ల‌ను ఆయ‌న విన్నారు. నంద్యాల నియోజ‌క వ‌ర్గం రాయ‌పాడు క్యాంప్ సైట్ లో త‌ట‌స్థ ప్ర‌ముఖుల‌తో ముఖాముఖి స‌మావేశం నిర్వ‌హించారు. న‌న్ను వైఎస్ కు ఎందుకు నివాళి అర్పించార‌ని అడుగుతున్నారు.

కొన్ని నిర్ణ‌యాల‌తో నేను ఏకీభ‌వించ‌ను. కానీ ఆయ‌న ఏనాడూ ఏపీ రాష్ట్ర ప‌రువు తీసేలా ప్ర‌వ‌ర్తించ లేద‌న్నారు నారా లోకేష్. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన అన్ని ప్రాజెక్టుల‌ను కొన‌సాగించార‌ని కొనియాడారు. ద‌క్షిణాది బీహార్ గా ఏపీని మార్చేశారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఫాక్స్ కంపెనీని తీసుకు వ‌స్తే దానిని ప‌ట్టించు కోలేద‌న్నారు. మెగా డీఎస్సీ ఏమైంద‌ని ప్ర‌శ్నించారు. ఇచ్చిన హామీల‌న్నీ తుంగ‌లో తొక్కాడంటూ ఆరోపించారు.

Also Read : PM Modi

Leave A Reply

Your Email Id will not be published!