Sonia Gandhi : అద్భుత విజయం కర్ణాటకకు వందనం
ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ
Sonia Gandhi : ఇవాళ ఆనందంగా ఉంది. అంతకు మించి సంతోషంగా ఉందన్నారు ఏఐసీసీ మాజీ చీఫ్ సోనియా గాంధీ(Sonia Gandhi). కర్ణాటక ప్రభుత్వ ప్రమాణ స్వీకారోత్సవానికి తాను హాజరు కాలేక పోయినందుకు బాధగా ఉందన్నారు. ఈ మేరకు కర్ణాటక ప్రజలకు వీడియో ద్వారా సందేశం అందజేశారు. అసాధారణ విజయాన్ని కాంగ్రెస్ పార్టీకి కట్టబెట్టారని ఏమిచ్చి మీ రుణం తీర్చుగోలనని పేర్కొన్నారు సోనియా గాంధీ(Sonia Gandhi).
కర్ణాటక ప్రజలకు, మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నట్లు తెలిపారు. అనారోగ్యం కారణంగా తాను ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాలేక పోయానని స్పష్టం చేశారు. తాము ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి నెరవేరుస్తామని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పు చరిత్రాత్మకమైనదని అన్నారు.
తనను ముందు నుంచి ప్రత్యేకంగా ఆదరించారని గుర్తు చేశారు సోనియా గాంధీ. ప్రజలు తమను ఆదరించే పార్టీని కోరుకున్నారని, ఇది ఫలితాల్లో వెల్లడైందన్నారు. ఏ పార్టీపై ఆధార పడకుండా స్పష్టమైన మెజారిటీని ఇచ్చినందుకు తనకు సంతోషంగా ఉందన్నారు. ఎన్నికల సందర్బంగా ప్రకటించిన ఐదు హామీలను తక్షణమే అమలు చేసేందుకు తొలి కేబినెట్ సమావేశం ఇప్పటికే ఆమోదం తెలిపినందుకు గర్విస్తున్నానని స్పష్టం చేశారు సోనియా గాంధీ.
ఇదిలా ఉండగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 224 సీట్లకు గాను కాంగ్రెస్ పార్టీ 136 సీట్లను కైవసం చేసుకుంది. 65 సీట్లకే పరిమితమైంది బీజేపీ. జేడీఎస్ 19 సీట్లతో సరి పెట్టుకుంది. నలుగురు ఇండిపెండెంట్లు సైతం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు.
Also Read : TTD EO Dharma Reddy
