టీఎంసీ ఎంపీలు రాజీనామా చేయాలి : ఎంపీ

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన అభిషేక్ బెన‌ర్జీ

ఢిల్లీ : తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి , మాజీ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ మేన‌ల్లుడు అభిషేక్ బెన‌ర్జీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఇవాళ దేశ రాజ‌ధాని ఢిల్లీలో పార్ల‌మెంట్ ముందు జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా త‌మ పార్టీ గుర్తుతో గెలుపొందిన ఎమ్మెల్యేలు త‌మ పార్టీని వీడ‌డం ప‌ట్ల స్పందించారు. అయితే త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేయ‌డం వారి వ్య‌క్తిగ‌తం అని పేర్కొన్నారు. .మూడు నాలుగు రోజుల క్రితం టీఎంసీకి చెందిన 20 మంది ఎంపీలు స్పీకర్‌ను కలిసి, తమకంటూ ఒక ప్రత్యేక గ్రూపును ఏర్పాటు చేసుకున్నట్లు ప్రకటించారని తెలిపారు.

మీడియా కథనాల ప్రకారం తమను ఒక ప్రత్యేక గ్రూపుగా పరిగణించాలని వారు కోరార‌న్నారు అభిషేక్ బెన‌ర్జీ. ఆ తర్వాత కొన్ని గంటలకే వారిలో ఇద్దరు నలుగురు ఎన్‌సీపీఐలో విలీనమైనట్లు ప్రకటించారన్నారు, కానీ ఆ విషయం మాలో ఎవరికీ తెలియదని చెప్పారు. టీఎంసీ లోక్‌సభ నాయకుడిగా తాను 20 వేర్వేరు అనర్హత పిటిషన్లను దాఖలు చేశాన‌ని చెప్పారు. ప్రత్యేక గ్రూపును ఏర్పాటు చేసుకున్నామని చెప్పుకుంటున్న వీరికి రాజీనామా చేసే బాద్య‌త లేదా అని ప్ర‌శ్నించారు. వీరికి వ్యతిరేకంగా 10వ షెడ్యూల్ ఉందన్న విష‌యం తెలియ‌క పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. వారికి కొంచెమైనా నిజాయితీ ఉంటే, తమ పదవుల నుంచి తక్ష‌ణ‌మే త‌ప్పు కోవాల‌ని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉండ‌గా బీజేపీ ఆప‌రేష‌న్ దెబ్బ‌కు సుదీర్ఘ కాలంగా ప‌శ్చిమ బెంగాల్ లో అధికారంలో ఉన్న టీఎంసీ పార్టీ త‌న ప‌వ‌ర్ ను కోల్పోయింది. అనూహ్యంగా బీజేపీ ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది. టీఎంసీ పార్టీ నిట్ట నిలువునా చీలి పోయే ద‌శ‌కు చేరుకుంది.

Leave A Reply

Your Email Id will not be published!