Arvind Kejriwal : ఉద్ధవ్ ఠాక్రేను కలిసిన కేజ్రీవాల్
ఆప్ చీఫ్ కు బేషరతు మద్దతు
Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) బుధవారం ముంబైలో శివసేన బాల్ ఠాక్రే పార్టీ చీఫ్ , మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రేను కలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీలు సంజయ్ సింగ్ , రాఘవ్ చద్దాతో పాటు ఢిల్లీ విద్యా శాఖ మంత్రి అతిషి ఉన్నారు. వీరితో పాటు శివసేన రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు గంటలకు పైగా కేజ్రీవాల్ , ఉద్దవ్ ఠాక్రే మధ్య సమావేశం జరిగింది.
కేంద్రం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. సుప్రీంకోర్టు పూర్తి స్థాయిలో తీర్పు చెప్పిందని, లా అండ్ ఆర్డర్ , భూ వ్యవహారాలు మాత్రమే లెఫ్టినెంట్ గవర్నర్ కు ఉంటాయని స్పష్టం చేసిందన్నారు. ఇదే సమయంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే సర్వాధికారాలు లభిస్తాయని పేర్కొంది. ఎల్జీ కేవలం మంత్రి మండలితో అనుసంధానం కావాలని , ఆయనకు ఎలాంటి పవర్స్ ఉండవని సంచలన తీర్పు వెలువరించింది.
కోర్టు తీర్పు వెలువడిన వెంటనే మోదీ, అమిత్ షా సమావేశం అయ్యారు. కేంద్ర సర్కార్ తరపున ఆర్డినెన్స్ తీసుకు వచ్చారు. ఇప్పటికే బీజేపీ, దాని అనుబంధ పార్టీలకు భారీ మెజారిటీ ఉంది. కానీ రాజ్యసభలో లేదు. చట్టం బిల్లుగా మారాలంటే రెండు సభల్లోనూ ఆమోదం పొందాల్సి ఉంటుంది. దీంతో ఈ ఆర్డినెన్స్ ను అడ్డుకునేందుకు పావులు కదుపుతున్నారు సీఎం కేజ్రీవాల్. ఇందులో భాగంగా ఆయన బీహార్ సీఎం నితీశ్ , పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలుసుకున్నారు. తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇదే సమయంలో ఉద్దవ్ ఠాక్రే సైతం ఓకే చెప్పారు. దీని వెనుక సంజయ్ రౌత్ కీలక పాత్ర పోషించారు.
Also Read : CM KCR
