Rahul Gandhi : బేటీ బచావో అంటే దాడులు చేయడమా
ప్రధాని మోదీపై నిప్పులు చెరిగిన రాహుల్
Rahul Gandhi : ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేశారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళా రెజ్లర్ల పై ఢిల్లీ పోలీసులు దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు రాహుల్ గాంధీ(Rahul Gandhi).
నూతన పార్లమెంట్ భవనం సందర్భంగా మహిళా రెజ్లర్లు మహిళా పంచాయత్ పేరుతో శాంతియుతంగా మార్చ్ చేపట్టాలని నిర్ణయించారు. ఈమేరకు రెండు కిలోమీటర్ల మేర పార్లమెంట్ భవనం ఉండగా పోలీసులు అడ్డుకున్నారు. ఆపై మహిళా రెజ్లర్లు అని చూడకుండా ఎక్కడ పడితే అక్కడ దాడికి దిగారు. యావత్ దేశం చూస్తుండగానే వీళ్లు మనుషులుగా ప్రవర్తించ లేదని వాపోయారు రాహుల్ గాంధీ. ఇది పూర్తిగా నిరంకుశ ధోరణికి పరాకాష్ట అని మండిపడ్డారు.
బేటీ బచావ్ బేటీ పడావో అంటే దాడులు చేయడమా అంటూ ప్రధాన మంత్రి మోదీని ప్రశ్నించారు. మహిళా రెజ్లర్ల పట్ల అనుసరించిన తీరు అత్యంత దారుణమన్నారు రాహుల్ గాంధీ. దాడికి పాల్పడిన ఖాకీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
Also Read : Priyanka Gandhi
