TDP Manifesto : భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో మేనిఫెస్టో
ప్రకటించిన నారా చంద్రబాబు నాయుడు
TDP Manifesto : రాజమహేంద్రంలోని వేదగిరి వేదికగా జరిగిన మహానాడులో టీడీపీ(TDP) చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. లక్షలాదిగా జనం తరలి వచ్చారు ఈ సభకు. ఇది ఊహించని సక్సెస్. దీంతో బాబు లో మరింత జోష్ పెరిగింది. ఈ సందర్భంగా మహానాడు వేదికగా సమర శంఖం పూరించారు చంద్రబాబు నాయుడు. భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో మేనిఫెస్టోను(Manifesto) ప్రకటించారు.
తాము అధికారంలోకి వస్తే పేదలను సంపన్నులను చేస్తామన్నారు. ఐదేళ్లలో ఆదాయాన్ని రెట్టింపు చేసే పూచీ నాదన్నారు. బీసీలకు రక్షణ చట్టం తీసుకు వస్తామని ప్రకటించారు. వారికి అన్ని విధాలుగా సాయం చేస్తామన్నారు. ఇంటింటికీ మంచి నీరు పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. అన్నదాత పథకం కింద ఏపీలోని ప్రతి రైతుకు ఏడాదికి రూ. 15,000 ఆర్థిక సాయం ఇస్తామన్నారు చంద్రబాబు నాయుడు.
మహా శక్తి పేరుతో ప్రతి కుటుంబంలో 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు స్త్రీ నిధి కింద నెలకు 1500 రూపాయలను వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. తల్లికి వందనం పేరుతో ప్రతి కుటుంబంలోని పిల్లలకు చదువు కోసం ఒక్కొక్కరికి రూ, 15,000 ఇస్తుందన్నారు. దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామన్నారు.
ఉచిత బస్సు ప్రయాణం పథకం కింద స్థానిక బస్సుల్లో మహిళలకు ఉచితంగా ఎలాంటి టికెట్ లేకుండానే ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఏపీలోని నిరుద్యోగులకు 20 లక్షల కొలువులు ఇస్తామన్నారు. ప్రతి నిరుద్యోగికి భృతి చెల్లిస్తామని ప్రకటించారు.
Also Read : Mahanadu Croud
