CM KCR : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకున్నారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలు అవుతున్నాయని అన్నారు.
పాలనా పరంగా ప్రజలకు సౌలభ్యంగా ఉండేందుకు కొత్తగా కలెక్టరేట్ లను నిర్మించడం జరిగిందన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తాను తీసుకు వచ్చిన ధరణిని రద్దు చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారంటూ మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో ఎవరు ఎవరిని ఛీత్కరిస్తారో తేలుతుందన్నారు.
ధరణిని బంగాళా ఖాతంలో వేస్తామన్న ఆ సన్నాసులను మీరంతా మేల్కొని మనకు ఓట్లు వేసి కాంగ్రేసోళ్లను బంగాళా ఖాతంలోకి విసిరి వేయాలని పిలుపునిచ్చారు కేసీఆర్(CM KCR). గతంలో రెవెన్యూ శాఖలో భయంకరమైన దోపిడీ జరిగేదన్నారు. ఎవరి భూమి ఎవరి చేతుల్లో ఉండేదో తెలిసేది కాదన్నారు. నిన్న ఉన్న భూమి తెల్లాసరే సరికి పహానీలు మారి పోయేవన్నారు.
కానీ ఇప్పుడు ఆ సీన్ లేదన్నారు. కాంగ్రెస్ వాళ్లు వస్తే మళ్లీ పైరవీకారులు వస్తారు. వీఆర్వోలు వస్తారు. మరి వీరంతా వస్తే రైతు బంధు ఎలా వస్తుందని ప్రశ్నించారు సీఎం.
Also Read : Rahul Gandhi : దేశానికి మానవీయ స్పర్శ అవసరం
