Anurag Thakur Invite : అనురాగ్ ఠాకూర్ తో రెజ్లర్ల భేటీ
చర్చలకు రావాలని ఆహ్వానం
Anurag Thakur Invite : తమకు న్యాయం చేయాలని, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ , బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను అరెస్ట్ చేయాలని కోరుతూ మహిళా రెజ్లర్లు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే 5 రోజుల పాటు కేంద్రానికి డెడ్ లైన్ ప్రకటించారు. సింగ్ పై ఢిల్లీ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఇందులో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఇదిలా ఉండగా సంయుక్త కిసాన్ మోర్చా జూన్ 9 వరకు డెడ్ లైన్ విధించింది కేంద్రానికి. దీంతో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తో మహిళా రెజ్లర్లతో పాటు బజరంగ్ పునియా భేటీ అయ్యారు. ఈ సందర్బంగా చట్టం అందరికీ ఒకేలాగా ఉంటుందని స్పష్టం చేసినట్లు సమాచారం.
షా సూచనల మేరకు క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) బుధవారం చర్చలకు ఆహ్వానించారు మల్లయోధులను. క్రీడాకారులు సాక్షి మాలిక్, బజరంగ్ పునియా క్రీడా శాఖ మంత్రి నివాసంలో కలుసుకున్నారు. ఇంకా ఏం జరుగుతుందనేది తెలియ రాలేదు. కేంద్రం ముందు మూడు డిమాండ్లు ఉంచారు. ప్రధానంగా తమను లైంగికంగా, మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ ను అరెస్ట్ చేయాలని, పదవి నుంచి తొలగించాలని.
అంతే కాకుండా తమకు పూర్తి రక్షణ కల్పించాలని కోరారు. నార్కో టెస్ట్ చేయించాలని కోరారు. ఇదే సమయంలో తమపై ఉన్న కేసులను ఎత్తి వేయాలని విన్నవించారు. ఈ మొత్తం డిమాండ్లను సావధానంగా విన్న అమిత్ షా త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు రంగంలోకి ఠాకూర్ దిగారు.
Also Read : Appalayagunta : వైభవోపేతం శ్రీనివాసుడి బ్రహ్మోత్సవం
