KTR : ఐటీ, పురపాలిక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం 10వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా తెలాంగణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తోంది. ప్రతి రోజూ ఒక్కో కార్యక్రమానికి ప్రయారిటీ ఇస్తూ వస్తోంది. జూన్ 13న మహిళ సాధికారతకు కేటాయించింది. ఘనంగా సాహిత్య ఉత్సవాలను నిర్వహించింది.
ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు ట్విట్టర్ వేదికగా. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళలకు ప్రయారిటీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనేక సంక్షేమాలను అమలు చేసిన ఘనత తమదేనని పేర్కొన్నారు. సీఎంకు మహిళలంటే ఎనలేని గౌరవమని, వారు చల్లంగా ఉండాలని కోరుకుంటూ ఆడబిడ్డలకు ఆసరాగా నిలిచారని కొనియాడారు.
తాను తన తండ్రి నుంచి ఎల్లప్పుడూ స్పూర్తి పొందుతానని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్(KTR). ఆకాశంలో సగమే కాదు సంక్షేమంలో కూడా సగానికంటే ఎక్కువగా లబ్ది పొందేలా చేశారని తెలిపారు. ప్రస్తుతం దేశానికే తలమానికంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. మహిళా సంక్షేమానికి భారీ ఎత్తున బడ్జెట్ కేటాయించిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కిందన్నారు కేటీఆర్.
అప్పుడే పుట్టిన ఆడబిడ్డ నుంచి ఆరు పదులు దాటిన అవ్వల వరకు ఆదుకుంటున్న ఏకైక రాష్ట్రం భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు మంత్రి.
Also Read : Naseeruddin Shah : నసీరుద్దీన్ షా కీలక కామెంట్స్
