Bandi Sanjay Kavitha : కవిత కామెంట్స్ పై భగ్గుమన్న బండి
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు
Bandi Sanjay Kavitha : భారతీయ జనతా పార్టీ స్టేట్ చీఫ్ , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ నిప్పులు చెరిగారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తమ సర్కార్ పై, ప్రత్యేకించి పీఎం మోదీని ప్రశ్నించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. రాష్ట్రంలో కొలువు తీరిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళల గోస గురించి ఎంత చెప్పినా తక్కువేనని ఎద్దేవా చేశారు. మంగళవారం బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు.
రాష్ట్రానికి తొలి పౌరురాలైన గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ పట్ల మీ సర్కార్ అనుసరించిన తీరు గురించి జనానికి తెలుసన్నారు. ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. పొద్దస్తమానం సంక్షేమం గురించి ప్రచారం చేసుకునే మీకు తమ ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని అనే హక్కు లేదన్నారు బండి సంజయ్(Bandi Sanjay). గిరిజన మహిళలపై దారుణంగా ప్రవర్తించింది ఎవరో తెలుసు కోవాలని పేర్కొన్నారు.
బతుకమ్మను అవమాన పరిచిన వారితో, తెలంగాణ భాషను, యాసను , సంస్కృతిని, నాగరికతను కించ పరిచిన వాళ్లతో ఆలింగనం చేసుకుంటున్నది, వ్యాపారాలు చేస్తున్నది ఎవరో తెలియదా కవితక్కా అని ప్రశ్నించారు బండి సంజయ్ కుమార్. మహిళా సంక్షేమం పేరుతో మోసం చేస్తున్నది సీఎం కేసీఆర్ కాదా అని నిలదీశారు. రాష్ట్ఆరన్ని అప్పుల కుప్పగా మార్చేసిన ఘనత నీ తండ్రికే దక్కుతుందన్నారు బీజేపీ చీఫ్.
Also Read : MLC Kavitha : మోదీ పాలనలో మహిళలకు ఇక్కట్లు
