Rakesh Tikait : ట్విట్ట‌ర్ మాజీ సీఇవో చెప్పింది నిజం

రైతు అగ్ర నేత రాకేశ్ టికాయ‌త్ కామెంట్స్

Rakesh Tikait : దేశ వ్యాప్తంగా ఇప్పుడు ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు దారి తీసింది మోదీ ప్ర‌భుత్వంపై ట్విట్ట‌ర్ మాజీ సిఇవో చేసిన కామెంట్స్. సాగు చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు చేసిన ఉద్య‌మానికి సంబంధించి ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్ట‌కూడ‌ద‌ని, ఫోటోలు, వీడియోలు షేర్ చేయొద్దంటూ పెద్ద ఎత్తున త‌మ‌పై ఒత్తిళ్లు వ‌చ్చాయ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు జాక్ డోర్సీ. ఆయ‌న ఇంట‌ర్నేష‌న‌ల్ మీడియాతో మాట్లాడారు. ఈ మేర‌కు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

దీనిపై బీజేపీ తీవ్రంగా ఖండించింది. కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్ , ఐటీ స‌హాయ శాఖ మంత్రి కూడా నిప్పులు చెరిగారు. ఇదంతా కావాల‌ని చేస్తున్న అవాస్త‌వాలంటూ కొట్టి పారేశారు. ఇదిలా ఉండ‌గా కేంద్రానికి వ్య‌తిరేకంగా చేప‌ట్టిన రైతు మ‌హోద్య‌మానికి నాయ‌క‌త్వం వ‌హించారు భార‌తీయ కిసాన్ యూనియ‌న్ జాతీయ అధికార ప్ర‌తినిధి, సంయుక్త కిసాన్ మోర్చా అగ్ర నేత రాకేశ్ టికాయ‌త్(Rakesh Tikait).

మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్ మాజీ సీఇవో చేసిన కామెంట్స్ పై హ‌ర్యానా లోని కురుక్షేత్రలో రైతుల ఆందోళన సంద‌ర్భంగా స్పందించారు. ఈ మేర‌కు జాతీయ మీడియాతో మాట్లాడారు. ఆనాడు తాము చేప‌ట్టిన ఉద్యమానికి ఆశించిన స్థాయిలో ప్ర‌చారం ల‌భించ లేద‌న్నారు. ఇది అక్ష‌రాల వాస్త‌వ‌మ‌న్నారు. కానీ ట్విట్ట‌ర్ లాంటి కొన్ని సంస్థ‌లు మోదీ ప్ర‌భుత్వానికి త‌ల వంచ‌కుండానే త‌మ‌కు మ‌ద్ద‌తు ప‌లికాయ‌ని పేర్కొన్నారు. ఇందులో జాక్ డోర్సీ చెప్పిన దాంట్లో అన్నీ నిజాలు ఉన్నాయ‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టారు రాకేశ్ టికాయ‌త్.

Also Read : Gali Janardhan Reddy : ‘గాలి’కి కోర్టులో ఎదురుగాలి

Leave A Reply

Your Email Id will not be published!