MP Sanjay Singh : మోదీ సర్కార్ దేశానికి క్షమాపణ చెప్పాలి
ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ డిమాండ్
MP Sanjay Singh : ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. వెంటనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తాము మొదటి నుంచీ చెబుతూ వస్తున్నామని అది ఇవాళ ట్విట్టర్ మాజీ సిఇవో జాక్ డోర్సీ చేసిన వ్యాఖ్యలతో తేట తెల్లమైందని అన్నారు.
ఇదిలా ఉండగా దేశంలో ప్రజాస్వామ్యం అన్నది లేదని ఎద్దేవా చేశారు. మోదీ వచ్చాక దేశంలో నియంతృత్వం, రాచరికం పెరిగి పోయిందని ఆరోపించారు సంజయ్ సింగ్(MP Sanjay Singh). తమపై కక్ష కట్టారని, చివరకు సుప్రీంకోర్టు ఆదేశించినా అమలు చేయడం లేదని మండిపడ్డారు.
గతంలో దేశ వ్యాప్తంగా జరిగిన రైతు ఉద్యమం సందర్బంగా మోదీ ప్రభుత్వం తమను ఫోటోలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని పంచుకోకుండా చేయాలని ఒత్తిడి తీసుకు వచ్చిందని ట్విట్టర్ మాజీ సీఇవో జాక్ డోర్సీ చెప్పడాన్ని ప్రత్యేకంగా ఎంపీ ప్రస్తావించారు. ఇది పూర్తిగా అక్షరాల వాస్తవమన్నారు సంజయ్ సింగ్.
ఒక్క ట్విట్టరే కాదు యూట్యూబ్, గూగుల్, ఫేస్ బుక్ , టెలిగ్రామ్ , వాట్సాప్ ఇలా ప్రతి దానిపై చట్టం పేరుతో, లొసుగుల పేరుతో, అధికారాన్ని అడ్డం పెట్టుకుని మోదీ ప్రభుత్వం ఆధిపత్యాన్ని చెలాయించిందన్నారు ఎంపీ. ఇది పూర్తిగా వాస్తవమని, తాము ముందు నుంచీ నెత్తీ నోరు బాదుకుంటున్నా పట్టించు కోలేదన్నారు. అందుకే జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
Also Read : Rakesh Tikait : ట్విట్టర్ మాజీ సీఇవో చెప్పింది నిజం
