Bhatti Vikramarka : కేసీఆర్ పాలనలో రైతులు బుగ్గిపాలు
నిప్పులు చెరిగిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
Bhatti Vikramarka : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నిప్పులు చెరిగారు. భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం లో రైతులకు కష్టాలు తప్ప ఒరిగింది ఏమీ లేదన్నారు. మంగళవారం ఆయన చేపట్టిన పాదయాత్ర నల్లగొండ జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా రైతులను కలుసుకున్నారు. వారి ఇబ్బందుల గురించి ఆరా తీశారు. తమ ప్రభుత్వం వచ్చేంత వరకు ఆగాలని , అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు.
రైతు బంధు పేరుతో దగా చేయడం తప్ప ఆదుకున్న పాపాన పోలేదన్నారు. కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని, పండించిన పంటకు ధర రాక పోతే ఎలా అని ప్రశ్నించారు. ధాన్యానికి భరోసా లేదు, రైతులకు అండగా ఉండాల్సిన సర్కార్ కేవలం రైతు బంధు ఇచ్చి చేతులు దులుపు కుంటున్నారని ఆరోపించారు భట్టి విక్రమార్క(Bhatti Vikramarka).
ప్రాజెక్టుల పేరుతో కమీషన్లు దండుకునేందుకు ప్రయారిటీ ఇచ్చారే తప్పా పొలాలకు నీళ్లు రావడం లేదన్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోక పోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా జాబ్స్ ఖాళీగా ఉన్న ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు. అన్నీ స్కాంలు తప్ప ఒక్కటన్నా సరిగా నిర్వహించారా అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు.
వ్యవస్థలను నిర్వీర్యం చేసి పాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్ కు తగిన రీతిలో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.
Also Read : MP Sanjay Singh : మోదీ సర్కార్ దేశానికి క్షమాపణ చెప్పాలి
