Bandi Sanjay : ట‌చ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు – బండి

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన బీజేపీ చీఫ్

Bandi Sanjay : భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ బండి సంజ‌య్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. త‌మ పార్టీతో భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు ట‌చ్ లో ఉన్నార‌ని పేర్కొన్నారు. బీఆర్ఎస్ త‌రహాలో బీజేపీ రాజ‌కీయ వ్య‌భిచారం చేయ‌ద‌న్నారు బండి సంజ‌య్.

త‌మ పార్టీలో చేరాలంటే ముందు ప‌ద‌వుల‌కు రాజీనామా చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలోని 119 సీట్ల‌కు గాను 30 సీట్ల‌లో బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు క‌నీసం డిపాజిట్లు కూడా రావ‌ని జోష్యం చెప్పారు బీజేపీ స్టేట్ చీఫ్‌.

త్వ‌ర‌లో ధ‌ర‌ణితో ఇబ్బందులు ప‌డుతున్న బాధితుల‌తో క‌లిసి బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. క‌మీష‌న్లు , భూ క‌బ్జాల‌కు బీఆర్ఎస్ నేత‌లు పార్టీ నియోజ‌క‌వ‌ర్గ ఆఫీసుల‌ను వాడుకుంటున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు బండి సంజ‌య్.

ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి , జ‌నం ప‌క్షాన పోరాడేందుకు భార‌తీయ జ‌న‌తా పార్టీ కార్యాల‌యాల‌ను ఉప‌యోగిస్తున్నామ‌ని చెప్పారు. ఇందులో భాగంగానే కుత్బుల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ ఆఫీసును ప్రారంభించిన‌ట్లు స్ప‌ష్టం చేశారు.

రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ధ‌ర‌ణి వ‌ల్ల రాష్ట్రానికి న‌ష్టం త‌ప్ప ఒరిగింది ఏమీ లేద‌ని ఎద్దేవా చేశారు. ఏం సాధించారంటూ తెలంగాణ‌లో ద‌శాబ్ది ఉత్స‌వాలు నిర్వ‌హిస్తున్నారంటూ ప్ర‌శ్నించారు బండి సంజ‌య్(Bandi Sanjay).

రాబోయే రోజుల్లో భార‌త రాష్ట్ర స‌మితికి పుట్ట‌గ‌తులు ఉండ‌వ‌న్నారు. ప్ర‌జ‌లు మార్పు కోరుకుంటున్నార‌ని ఇక తాము ప‌వ‌ర్ లోకి రావ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు బండి సంజ‌య్ .

Also Read : Karishma Tanna : ‘స్కూప్’ సూప‌ర్ క‌రిష్మా అదుర్స్

Leave A Reply

Your Email Id will not be published!