Ponguleti Jupally Join : జూప‌ల్లి..పొంగులేటి జంప్

ప‌లువురు నేత‌లు కాంగ్రెస్ లో చేరిక

Ponguleti Jupally Join : తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ జోష్ పెంచింది. త్వ‌ర‌లో శాస‌న‌స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న త‌రుణంలో పేరొందిన నాయ‌కులు పార్టీ తీర్థం పుచ్చుకోవ‌డం ఒకింత జోష్ నింపింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే , మాజీ చీఫ్ రాహుల్ గాంధీ స‌మ‌క్షంలో వీరంతా చేరారు. ఏఐసీసీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే , టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా హాజ‌ర‌య్యారు. చేరిన నేత‌ల‌ను ఖ‌ర్గే, రాహుల్ కు ప‌రిచ‌యం చేశారు.

ఇదిలా ఉండ‌గా ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణా రావు(Jupally Krishna Rao), ఖ‌మ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, కోడంగ‌ల్ మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే కోరం క‌న‌క‌య్య కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే పాయం వెంక‌టేశ్వ‌ర్లు, డీసీసీబీ మాజీ చైర్మ‌న్ మువామెంట్ విజ‌య బేబీ, మాజీ ఎస్సీ కార్పొరేష‌న్ చైర్మ‌న్ పిడ‌మ‌ర్తి ర‌వి, డీసీసీబీ చైర్మ‌న్ తుళ్లూరి బ్ర‌హ్మ‌య్య‌, మార్క్ ఫెడ్ రాష్ట్ర వైస్ చూర్మ‌న్ బొర్రా రాజ‌శేఖ‌ర్ , వార్యా మున్సిప‌ల్ వైస్ చైర్మ‌న్ ఎస్ . జైపాల్ కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. రాబోయే రోజుల్లో మ‌రికొంద‌రు నేత‌లు త‌మ పార్టీలో చేర‌బోతున్నార‌ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా జూప‌ల్లి కృష్ణా రావు, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి గ‌తంలో అధికారంలో ఉన్న భార‌త రాష్ట్ర స‌మితి పార్టీలో ఉన్నారు. వారిని పొమ్మ‌న‌కుండా పొగ పెట్టారు. దీంతో అటు బీజేపీలో చేరాలా లేక కాంగ్రెస్ లో అని మ‌ధ‌న‌ప‌డ్డారు. చివ‌ర‌కు రేవంత్ దౌత్యం ఫ‌లించింది కాంగ్రెస్ లో చేరేలా చేసింది.

Also Read : Yarlagadda Lakshmi Prasad(YLP) : యార్ల‌గ‌డ్డ‌కు జాతీయ‌ పుర‌స్కారం

Leave A Reply

Your Email Id will not be published!