Congress Slams : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. బుధవారం ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై అవాకులు చెవాకులు పేలడం మానుకోవాలని సూచించింది. 10 ఏళ్ల పాటు దేశంలో కాంగ్రెస్(Congress) అధికారంలో ఉన్నా, ఉన్నత పదవులు వరించినా వాటిని వదులుకున్న చరిత్ర తల్లీ కొడుకులది. గాంధీ కుటుంబం దేశం కోసం త్యాగం చేసిందని గుర్తు చేసింది పార్టీ. మరి నువ్వు , నీ కుటుంబం ఏం చేసిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలియదా అని ప్రశ్నించింది.
సందు దొరికింది కదా అని తండ్రి సీఎం, కొడుకు మంత్రి, కూతురు ఎమ్మెల్సీ, అల్లుడు మంత్రి, ఇంకొకడు ఎంపీ , ఇలా చెప్పుకుంటూ అన్ని పదవులు, పవర్ మీకే కదా మరి త్యాగాల కుటుంబంపై రాళ్లు వేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఒకరిపై ఆరోపణలు చేసే ముందు ముందూ వెనుకా ఒకసారి చూసుకుని మాట్లాడాలని కాంగ్రెస్ పార్టీ హితవు పలికింది. ఇక నీ ఐటీ తెలివి తేటలు, డ్రామాలు ఆపాలని స్పష్టం చేసింది.
పదవులు లేకుండా ఒక్క క్షణమైనా ఉండలేని మీకు ప్రజల కోసం తమప్రాణాలను పణంగా పెట్టిన గాంధీ కుటుంబం ఎక్కడ..ఒక్కసారి కేటీఆర్ ఆలోచించు కోవాలని పేర్కొంది. ఆనాడు సోనియా దయతలిచి ఇవ్వక పోయి ఉంటే ఇవాళ తెలంగాణ ఎక్కడ ఉండేదోనన్న సోయి లేక పోతే ఎలా అని ప్రశ్నించింది.
Also Read : Mallikarjun Kharge : తెలంగాణలో మార్పు ఖాయం – ఖర్గే
