Congress Success : స‌భ స‌క్సెస్ కాంగ్రెస్ లో జోష్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హ్యాపీ

Congress Success : తెలంగాణ రాష్ట్రంలోని ఖ‌మ్మంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన జ‌న గ‌ర్జ‌న స‌భ ఊహించ‌ని రీతిలో స‌క్సెస్ అయ్యింది. అంచ‌నాల‌కు మించి జ‌నం హాజ‌ర‌య్యారు. బీఆర్ఎస్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డంకులు సృష్టించినా పెద్ద ఎత్తున హాజ‌రు కావ‌డంతో మ‌రింత జోష్ నింపేలా చేసింది కాంగ్రెస్(Congress) నేత‌ల్లో.

ఆ పార్టీకి చెందిన ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన ప్ర‌సంగం ఆస‌క్తిని రేపింది. కార్య‌క‌ర్త‌ల్లో నూత‌న ఉత్సాహాన్ని క‌లుగ చేసింది. మొత్తంగా 3 ల‌క్ష‌ల మందికి పైగా ప్ర‌జ‌లు హాజ‌రు కావ‌డంతో పార్టీ ప‌రంగా మ‌రిన్ని కార్య‌క్ర‌మాలు చేప‌ట్టేందుకు రెడీ అవుతోంది.

ఖ‌మ్మం స‌భ రేప‌టి ఎన్నిక‌ల‌కు విజ‌యం సాధించేందుకు నాంది ప‌ల‌క‌నుంద‌ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మ‌రో వైపు ఆదిలాబాద్ నుంచి ఖ‌మ్మం జిల్లా వ‌ర‌కు 109 రోజుల పాటు పీపుల్స్ మార్చ్ పేరుతో పాద‌యాత్ర చేప‌ట్టారు. 1369 కిలోమీట‌ర్లు న‌డిచారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు.

ఇదే స‌మ‌యంలో ఖ‌మ్మం జిల్లాలో కీల‌క‌మైన నాయ‌కుడిగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువాను క‌ప్పుకున్నారు. ఈ జ‌న గ‌ర్జ‌న స‌భ‌ను స‌క్సెస్ చేసేందుకు శ‌త విధాలుగా ప్ర‌య‌త్నం చేశారు. ఆ మేర‌కు త‌న స‌త్తా ఏమిటో చూపించారు.

Also Read : RS Praveen Kumar : బీఎస్పీలో మ‌హిళలు కీల‌కం – ఆర్ఎస్పీ

Leave A Reply

Your Email Id will not be published!