YS Jagan : ఏపీలో కొలువు తీరిన వైసీపీ ప్రభుత్వం పల్లె ప్రగతిపై ఫోకస్ పెట్టారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. అన్ని వర్గాల సంక్షేమమే ప్రాతిపదికగా పని చేస్తున్నామని స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం తీసుకు వచ్చేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు పేదలు, మధ్య తరగతి ప్రజలకు మేలు చేకూరుస్తున్నాయి. ప్రధానంగా ప్రజలకు అందించే సేవలను గ్రామీణ ప్రాంతాల దరికి చేర్చిన ఘనత వైసీపీ సర్కార్ కే దక్కుతుందని చెప్పక తప్పదు.
పల్లె సీమలు ప్రగతి పథంలో నడిచేందుకు కావాల్సినన్ని నిధులను మంజూరు చేస్తూ ప్రత్యేకతను చాటుకున్నారు జగన్ రెడ్డి(YS Jagan). ఆయా గ్రామాలలో ఆర్బీకే సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆపై ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలలో, పనుల్లో గామస్తులు పాలు పంచుకునేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. దీని వల్ల గతంలో నిర్లక్ష్యానికి గురైన గ్రామ సీమలు ప్రగతి పథంలోకి చేరుకున్నాయని వైఎస్సార్ పార్టీ స్పష్టం చేసింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా అరుదైన ఫోటోను షేర్ చేసింది.
ప్రత్యేకించి జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నాడు నేడు కార్యక్రమం. దీని వల్ల విద్యా రంగంలోని ప్రాథమిక విద్యకు మంచి ఆదరణ లభించింది. ఆధునిక సౌకర్యాలతో బడులను తీర్చి దిద్దిన ఘనత జగన్ రెడ్డికే దక్కుతుంది.
Also Read : CM YS Jagan : 108 అంబులెన్స్ సేవలు ప్రశంసనీయం
