Raghunandan Rao : బండికి అన్ని కోట్లు ఎక్కడివి
దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్
Raghunandan Rao : తెలంగాణ రాష్ట్ర బీజేపీలో కలకలం రేగింది. ఆ పార్టీకి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన కామెంట్స్ చేశారు. ఆయన స్వపార్టీకి చెందిన చీఫ్ బండి సంజయ్ పై ఆరోపణలు గుప్పించడం చర్చకు దారి తీసేలా చేసింది. ఒకప్పుడు పుస్తెలు అమ్మి బరిలోకి దిగిన బండి సంజయ్ కు ఇవాళ వందల కోట్లు ఖర్చు చేసి ప్రకటనలు ఇచ్చే స్థాయికి ఎలా వచ్చారంటూ ప్రశ్నించారు.
ఎమ్మెల్యే రఘునందన్ రావు(Raghunandan Rao) సోమవారం ఢిల్లీకి బయలు దేరి వెళ్లారు. పార్టీ సీనియర్ నాయకులతో కలిశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర అసెంబ్లీలో ఇప్పటి వరకు బీజేపీకి ఫ్లోర్ లీడర్ లేరని ఆరోపించారు. తరుణ్ చుగ్ ఎవరు అంటూ నిలదీశారు. ఆయనను చూసి ప్రజలు ఓట్లు వేయలేదన్నారు రఘునందన్ రావు.
దుబ్బాకలో తనను చూసి, హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ ను చూసి ప్రజలు ఓట్లు వేశారని తరుణ్ చుగ్ ను కాదన్నారు. పార్టీ అన్నది తర్వాత అని ప్రధానంగా చూసేది వ్యక్తులను చూసి తమ అభిప్రాయాలను మార్చుకుంటారని పేర్కొన్నారు. ప్రస్తుతం కొందరికే ఎందుకు ప్రయారిటీ ఇస్తున్నారంటూ ప్రశ్నించారు. మొత్తంగా దుబ్బాక ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు గరం గరంగా మారాయి.
మరో వైపు సీనియర్లు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది.
Also Read : Pawan Kalyan : సంక్షేమం బక్వాస్ కల్తీ మద్యం జోష్
