Ronald Rose : జీహెచ్ఎంసీ కమిషనర్ గా రోనాల్డ్ రోస్
నలుగురు ఐఏఎస్ లపై బదిలీ వేటు
Ronald Rose : తెలంగాణ ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లపై బదిలీ వేటు వేసింది. హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) కమిషనర్ గా ఇప్పటి వరకు ఆర్థిక శాఖ లో పని చేస్తున్న రోనాల్డ్ రోస్ ను నియమించింది. డీఎస్ లోకేష్ కుమార్ తెలంగాణ కార్యాలయంలో అదనపు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గా ఎంపిక చేసింది.
అంతే కాకుండా నిర్మల్ జిల్లా కలెక్టర్ గా పని చేసిన ముష్రఫ్ అలీ ఫరూఖీ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఇక ప్రొహిబిషన్ ఎక్సైజ్ డైరెక్టర్ గా పని చేసిన సర్ఫరాజ్ అహ్మద్ తెలంగాణ జాయింట్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ గా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం.
త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐఏఎస్ అధికారులను బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలో మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ గా పని చేశారు రోనాల్డ్ రోస్(Ronald Rose). ఆ తర్వాత కీలకమైన శాఖ ఆర్థిక శాఖలో కార్యదర్శిగా పని చేశారు.
ఈ కీలక పదవితో పాటు గురుకులాల కార్యదర్శిగా రాజీనామా చేసిన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్థానంలో అదనపు బాధ్యతలు చేపట్టారు. మొత్తంగా స్ట్రిక్ట్ ఆఫీసర్ గా ఇప్పటి వరకు గుర్తింపు పొందిన రోనాల్డ్ రోస్ కు కీలకమైన జీహెచ్ఎంసీ పదవికి ఎంపిక చేయడం ఒకింత ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : KTR : మెడికల్ హబ్ గా హైదరాబాద్
