Purandeswari : ఏపీలో బీజేపీ బలోపేతంపై ఫోక‌స్

రాష్ట్ర చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి

Purandeswari : ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర భార‌తీయ జ‌న‌తా పార్టీ నూత‌న అధ్య‌క్షురాలిగా నియ‌మితులైన ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి గురువారం మ‌ర్యాద పూర్వ‌కంగా బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాను క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆమెను ప్ర‌త్యేకంగా అభినందించారు. త‌న‌పై న‌మ్మ‌కం ఉంచి ఉన్న‌త‌మైన ప‌ద‌విని క‌ట్ట‌బెట్టినందుకు న‌డ్డాకు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఒక ర‌కంగా గ‌తంలో ఎన్నో ప‌ద‌వులు నిర్వ‌హించిన‌ప్ప‌టికీ బీజేపీ చీఫ్ గా త‌న‌పై గురుత‌ర‌మైన బాధ్య‌త ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు త‌న‌వంతు కృషి చేస్తాన‌ని తెలిపారు ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి(Purandeswari).

ఏపీ , ఆంధ్రుల ప్ర‌యోజ‌నాల‌ను కాపాడేందుకు శాయ శ‌క్తులా ప్ర‌య‌త్నం చేస్తాన‌ని అన్నారు. త్వ‌ర‌లోనే రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ త‌రుణంలో బీజేపీ హై క‌మాండ్ దేశంలోని 5 రాష్ట్రాల‌లో పార్టీ అధ్య‌క్షుల‌ను మార్చింది. అందులో భాగంగా ఏపీ చీఫ్ గా ఉన్న సోము వీర్రాజును తొల‌గించింది.

పురందేశ్వ‌రి కి ఛాన్స్ ఇచ్చింది. ఇక కేంద్ర మంత్రిగా ఉన్న కిష‌న్ రెడ్డిని తెలంగాణ పార్టీ చీఫ్ గా నియ‌మించింది. మొత్తంగా ఇరు తెలుగు రాష్ట్రాల‌లో బీజేపీ పాగా వేయాల‌ని ప్లాన్ చేసింది. ఇందులో భాగంగానే అధ్య‌క్షుల‌ను మార్చింది.

Also Read : Eatala Rajender : దొర పాల‌న‌కు ద‌గ్గ‌ర ప‌డింది – ఈట‌ల

 

Leave A Reply

Your Email Id will not be published!