Eknath Shinde : మరాఠా సీఎం ఏక్ నాథ్ షిండే సంచలన కామెంట్స్ చేశారు. తాను రాజీనామా చేసినట్లు వస్తున్న వార్తలను ఖండించారు. ఇదంతా కావాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. మరో బాంబు పేల్చారు. శివసేన బాల్ ఠాక్రే వర్గం నుంచి మరో 10 మంది ఎమ్మెల్యేలు తమ వైపు వచ్చేందుకు రెడీగా ఉన్నారని స్పష్టం చేశారు.
తన సారథ్యంలో ప్రభుత్వం స్థిరంగా ఉంటుందన్నారు. ఎన్సీపీని తాము చీల్చేందుకు ప్రయత్నం చేసినట్లు ఆరోపణలను ఖండించారు. ఇది పూర్తిగా నిరాధారమన్నారు. వారంతకు వారే స్వచ్చంధంగా తమతో కలిసి వచ్చేందుకు వచ్చారని తెలిపారు. ఇందులో భాగంగానే ముందు జాగ్రత్తగా ఆలోచించి వారికి ప్రయారిటీ ఇవ్వడం జరిగిందన్నారు షిండే.
గురువారం మరాఠా సీఎం ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) మీడియాతో మాట్లాడారు. ఎవరు వచ్చినా తాము ఆదరించేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అజిత్ పవార్ తనకు పోటీదారు కానే కాదన్నారు. ఇదిలా ఉండగా బీజేపీ బిగ్ ట్విస్ట్ ఇవ్వబోతోందని, షిండే సారథ్యంలో వచ్చే ఎన్నికలకు వెళితే సీట్లు రావని ఆయనను తెలివిగా తప్పించాలని చూస్తోందంటూ ప్రచారం జరిగింది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం మరాఠా సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. కాగా బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని, పవార్ కు సీఎం పదవి అప్పగించి , ఫడ్నవీస్ ను కేంద్ర కేబినెట్ లోకి తీసుకుంటారని కూడా ప్రచారం జరుగుతోంది.
Also Read : Purandeswari : ఏపీలో బీజేపీ బలోపేతంపై ఫోకస్
