Karnataka High Court : పిల్ల‌లు ప్ర‌భుత్వాల‌ను విమ‌ర్శిస్తే ఎలా

క‌ర్ణాట‌క హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Karnataka High Court : క‌ర్ణాట‌క రాష్ట్ర హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. పిల్ల‌లు ఎలా ఉండాల‌నే దానిపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను విమ‌ర్శించ‌కుండా జాగ్ర‌త్త ప‌డాల‌ని సూచించింది. ఓ స్కూల్ యాజ‌మాన్యంపై న‌మోదు చేసిన దేశ ద్రోహం కేసు సంద‌ర్భంగా విచారించిన హైకోర్టు(Karnataka High Court) సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. విద్యార్థులు పాఠాలు నేర్చుకోవాలి, కానీ దేశానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అత్యున్న‌త ప‌ద‌విలో ఉన్న ప్ర‌ధాన మంత్రిపై విమ‌ర్శ‌లు చేస్తే ఎలా అని ప్ర‌శ్నించింది కోర్టు.

పీఎంను దూషించ‌డం, అవ‌మాన‌క‌ర‌మైన రీతిలో మాట్లాడ‌టం మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొంది. అయితే ఇది దేశ ద్రోహం కింద‌కు రాద‌ని స్ప‌ష్టం చేసింది. కానీ విలువ‌ల ప‌ట్ల కాస్తంత ఎరుక‌తో ఉండాల్సిన విద్యార్థులు, చిన్నారులు ఇలా త‌మ‌కు స్థాయికి మించి కామెంట్స్ చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది ధ‌ర్మాస‌నం.

బీద‌ర్ లోని షాహీన్ స్కూల్ యాజ‌మాన్యానికి చెందిన అల్లావుద్దీన్ , ఖ‌లీక్ , బిలాల్ , ఇనామ్ దార్ , మెహ‌తాబ్ ల‌పై బీద‌ర్ న్యూ టౌన్ ఠాణాలో కేసు న‌మోదైంది. దీనిని ఇవాళ కోర్టు ర‌ద్దు చేసింది. క‌ల్బుర్గి బెంచ్ లో జ‌స్టిస్ హేమంత్ చందం గౌడ్ ర‌ద్దు చేస్తున్న‌ట్లు తీర్పు చెప్పారు. యాజ‌మాన్యం పిల్ల‌ల‌కు నీతులు బోధించాలి..ఇలా విద్వేషాలు రెచ్చ‌గొడితే ఎలా అంటూ ప్ర‌శ్నించారు.

Also Read : Rahul Gandhi : రాహుల్ కు కోర్టులో చుక్కెదురు

Leave A Reply

Your Email Id will not be published!