V Srinivas Goud : రేవంత్ నోరు అదుపులో పెట్టుకో
నిప్పులు చెరిగిన శ్రీనివాస్ గౌడ్
V Srinivas Goud : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు రాష్ట్ర సాంస్కృతిక, క్రీడా శాఖ మంత్రి విరసనోళ్ల శ్రీనివాస్ గౌడ్. గురువారం మంత్రి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. పూర్తి అహంకారంతో మాట్లాడుతున్నాడని, రైతుల పట్ల ఎంత ప్రేమ ఉందో తను మాట్లాడిన మాటలను బట్టి చూస్తే అర్థం అవుతుందన్నారు శ్రీనివాస్ గౌడ్. విద్యుత్ సంస్థ ముందు గౌడ్ ఆందోళన చేపట్టారు. రైతులకు 3 గంటలు కరెంట్ ఇస్తే ఎట్లా వ్యవసాయం చేస్తాడని ప్రశ్నించారు.
తెలివి తప్పి, సోయి లేకుండా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్మరని అన్నారు. గతంలో వ్యవసాయాన్ని సర్వ నాశనం చేసిన చంద్రబాబు నాయుడును ఆదర్శంగా తీసుకుని రేవంత్ రెడ్డి ఇక్కడ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడంటూ ధ్వజమెత్తారు. ఇంకోసారి రైతుల గురించి నోరు జారితే బాగుండదని హెచ్చరించారు శ్రీనివాస్ గౌడ్(V Srinivas Goud). రైతులకు ఉచితంగా 24 గంటల పాటు ఎందుకు ఇవ్వకూడదో చెప్పాలన్నారు.
రైతు వ్యతిరేకి అని పూర్తిగా అర్థమై పోయిందన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అడ్రస్ లేకుండా చేస్తారని హెచ్చరించారు. ఇకనైనా నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిదన్నారు. ఆరుగాలం పండించే రైతులను అవమానిస్తే ఎలా అని ప్రశ్నించారు. రైతులు , పేదలు రేవంత్ రెడ్డిని నమ్మరని అన్నారు మంత్రి.
Also Read : Pawan Kalyan : ఎఫ్ఓఏ సంస్థలో ఏపీ ప్రజల డేటా