Chandrababu Naidu : టీచ‌ర్ హ‌త్య‌పై చంద్ర‌బాబు ఫైర్

రాజ‌కీయ కార‌ణాల‌తో చంపుతారా

Chandrababu Naidu : ఏపీలో శాంతి భ‌ద్ర‌త‌లు క్షీణించాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు తెలుగుదేశం పార్టీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా రాజాంలో ప్ర‌భుత్వ టీచ‌ర్ ఏగిరెడ్డి కృష్ణ‌ను దారుణంగా హ‌త్య చేశారు. ఆయ‌న హ‌త్య రాజ‌కీయ కార‌ణాల‌తో జ‌రిగింద‌ని మండిప‌డ్డారు చంద్ర‌బాబు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు.

దారుణ హ‌త్య‌కు పాల్ప‌డిన నిందితుల‌ను వెంట‌నే ప‌ట్టుకోవాల‌ని, క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేశారు చంద్ర‌బాబు నాయుడు(Chandrababu Naidu). రాజ‌కీయ దాడుల‌పై ప్ర‌భుత్వ పెద్ద‌ల‌, అధికారుల ఉదాసీన వైఖ‌రి వ‌ల్ల‌నే ఇలాంటి దారుణాలు రాష్ట్రంలో చోటు చేసుకుంటున్నాయ‌ని ఆరోపించారు. ఈ హ‌త్య‌కు రాష్ట్రంలో కొలువు తీరిన జ‌గ‌న్ స‌ర్కార్ బాధ్య‌త వ‌హించాల‌ని స్ప‌ష్టం చేశారు.

తాము ముందు నుంచి చెబుతూ వ‌స్తున్నామ‌ని, రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌న్నారు. లా అండ్ ఆర్డ‌ర్ అదుపులో లేద‌న్నారు. పాఠాలు చెప్పే పంతులును ఎలా హ‌త్య చేస్తారంటూ ప్ర‌శ్నించారు. ప్ర‌భుత్వం వెంట‌నే టీచ‌ర్ కుటుంబాన్ని ఆదుకోవాల‌ని నారా చంద్ర‌బాబు నాయుడు డిమాండ్ చేశారు.

జ‌గ‌న్ స‌ర్కార్ వ‌చ్చాక రాష్ట్రంలో దారుణాలు చోటు చేసుకుంటున్నాయ‌ని ఆరోపించారు. సామాన్యులు బ‌తికే ప‌రిస్థితి లేకుండా పోయింద‌ని నారా చంద్ర‌బాబు నాయుడు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Also Read : YV Subba Reddy : త్వ‌ర‌లో విశాఖ‌లో సీఎం క్యాంప్ ఆఫీస్

 

Leave A Reply

Your Email Id will not be published!