INDW vs BANW ODI : బంగ్లా చేతిలో భార‌త్ చిత్తు

40 ప‌రుగుల తేడాతో ఓట‌మి

INDW vs BANW ODI : బంగ్లాదేశ్ తో జ‌రిగిన వ‌న్డే మ్యాచ్ లో భార‌త(INDW vs BANW ODI) మ‌హిళా జ‌ట్టు ఓడి పోయింది. 40 ప‌రుగుల తేడాతో బంగ్లా షాక్ ఇచ్చింది. ఆదివారం జ‌రిగిన ఈ మ్యాచ్ లో ముందుగా ఆతిథ్య బంగ్లాదేశ్ జ‌ట్టు 43 ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 152 ర‌న్స్ చేసింది. 50 ఓవ‌ర్లు ఆడాల్సి ఉండ‌గా మ‌ధ్య‌లో వ‌ర్షం అడ్డంకిగా మారింది. దీంతో ఆటకు అంత‌రాయం క‌లిగింది. తిరిగి వ‌ర్షం వెలియ‌డంతో 153 ప‌రుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది బంగ్లాదేశ్ మ‌హిళ‌ల జ‌ట్టు.

43 ఓవ‌ర్ల ల‌క్ష్యాన్ని నిర్దేశించారు అంపైర్లు. దీంతో బ‌రిలోకి దిగిన భార‌త మ‌హిళా జ‌ట్టు 35.3 ఓవ‌ర్ల‌లో 113 ప‌రుగుల‌కే చాప చుట్టేశారు. అంత‌కు ముందు అరంగేట్రం చేసిన అమ‌న్ జోత్ ఔక‌ర్ అద్భుతంగా రాణించింది. వ‌స్తూనే నాలుగు కీల‌క వికెట్లు తీసింది. విస్తు పోయేలా చేసింది. బంగ్లాదేశ్ త‌ర‌పున కెప్టెన్ న‌గ‌ర్ సుల్తానా 39 ర‌న్స్ చేస్తే ఫ‌ర్జానా 27 ప‌రుగులు చేసింది.

భార‌త జ‌ట్టులో ఎవ‌రూ అంత‌గా రాణించ లేక పోయారు. ప‌రుగులు చేసేందుకు నానా తంటాలు ప‌డ్డారు. బంగ్లాదేశ్ బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో వికెట్లు స‌మ‌ర్పించుకున్నారు.

Also Read : Deepika Ranveer Divorce : దీపికా ర‌ణ్ వీర్ బంధం తెగిందా..?

Leave A Reply

Your Email Id will not be published!