Pawan Kalyan : భారీ ర్యాలీగా ఎస్పీ ఆఫీసుకు ప‌వ‌న్

సీఐపై చ‌ర్యలు తీసుకోవాల‌ని డిమాండ్

Pawan Kalyan : జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సోమ‌వారం భారీ ర్యాలీగా తిరుప‌తికి బ‌య‌లు దేరారు. త‌మ పార్టీకి చెందిన కార్య‌క‌ర్త‌ను తిరుప‌తి జిల్లా లోని శ్రీ‌కాళ‌హ‌స్తి లో సీఐగా ప‌ని చేస్తున్న అంజూ యాద‌వ్ చెంప ఛెల్లుమ‌నింపించారు. దాడి చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఆమెపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు లేకుండా పోయాయ‌ని ఆరోపించారు. ఇందుకు సంబంధించి అంజూ యాద‌వ్ ను ఉద్యోగం లోంచి తీసి వేయాల‌ని కోరుతూ ఎస్పీ ఆఫీసుకు బ‌య‌లు దేరి వెళ్లారు.

ఈ సంద‌ర్భంగా భారీ ర్యాలీ కొన‌సాగింది. అంత‌కు ముందు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్క‌డి నుంచి తిరుప‌తికి వెళ్లారు. మార్గ‌మ‌ధ్యంలో అభిమానులు, పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు త‌ర‌లి వ‌చ్చారు. భారీ జ‌న సందోహం మ‌ధ్య ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎస్పీ ఆఫీసుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

ఇదిలా ఉండ‌గా త‌న‌ను క‌లిసేందుకు ఎలాంటి ప‌ర్మిష‌న్ లేద‌ని స్ప‌ష్టం చేయ‌డంతో మ‌రింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని, త్వ‌ర‌లోనే ప్ర‌జ‌లు జ‌గ‌న్ రెడ్డి పాల‌న‌కు బుద్ది చెప్ప‌డం ఖాయ‌మ‌న్నారు. ఎవ‌రూ కూడా ప్ర‌స్తుత పాల‌న‌ను కోరుకోవ‌డం లేద‌న్నారు జ‌న‌సేన(Janasena) పార్టీ చీఫ్‌.

ఇదిలా ఉండ‌గా సీఐపై చ‌ర్య‌లు తీసుకుంటే తాము చూస్తూ ఊరుకునే ప్ర‌స‌క్తి లేద‌ని యాద‌వ సంఘాలు హెచ్చ‌రించాయి. కావాల‌ని కుట్ర పూరితంగా అగ్ర‌వ‌ర్ణాలు టార్గెట్ చేస్తున్నాయంటూ ఆరోపించాయి.

Also Read : India Squad ICC World Cup : వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కు భార‌త జ‌ట్టు

Leave A Reply

Your Email Id will not be published!