Heavy Rain AP Telangana : తెలుగు రాష్ట్రాల‌లో 3రోజులు మోస్త‌రు వ‌ర్షాలు

హెచ్చ‌రించిన వాతావ‌ర‌ణ శాఖ

Heavy Rain AP Telangana : బంగాళా ఖాతంలో ఏర్ప‌డిన అల్ప పీడ‌నం ప్ర‌భావంతో తెలుగు రాష్ట్రాల‌లో ఓ మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. రాబోయే మూడు రోజుల పాటు ఆంధ్ర ప్ర‌దేశ్ , తెలంగాణ లోని ప‌లు జిల్లాల‌ను వ‌ర్షాలు ముంచెత్తుతాయ‌ని పేర్కొంది. ఉత్త‌ర కోస్తా , ద‌క్షిణ కోస్తా ల‌లో ప‌లు చోట్ల రాయ‌ల‌సీమ‌లో అక్క‌డ‌క్క‌డా వ‌ర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది.

ఇవాళ పార్వ‌తీపురం, శ్రీ‌కాకుళం, మ‌న్యం, విజ‌య‌న‌గ‌రం , అల్లూరి సీతారామ‌రాజు జిల్లాల్లో మోస్త‌రుగా వ‌ర్షాలు కురుస్తాయ‌ని వెల్ల‌డించింది. ఇక ఉత్త‌రాంధ్ర‌లో విశాఖ ప‌ట్నం, అన‌కాప‌ల్లి, కాకినాడ‌, కోన‌సీమ‌, ఉభ‌య గోదావ‌రి జిల్లాల‌తో పాటు ఏలూరు, ఎన్టీఆర్ , కృష్ణా, ప‌ల్నాడు, గుంటూరు, బాప‌ట్ల , నంద్యాల‌, క‌ర్నూలు జిల్లాల్లో మోస్త‌రు వాన‌లు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ స్ప‌ష్టం చేసింది.

వాయ‌వ్య బంగాళా ఖాతంలో ఉపరిత‌ల ఆవ‌ర్త‌నం కాస్తా అల్ప‌పీడ‌నంగా మారింద‌ని మంగ‌ళ‌వారం నాటికి అది వాయుగుండంగా బ‌ల‌ప‌డ‌నుంద‌ని తెలిపింది. దీని ప్ర‌భావంతో తెలుగు రాష్ట్రాల‌లో(Heavy Rain AP Telangana) ఉరుములు, మెరుపుల‌తో పాటు అక్క‌డ‌క్క‌డా పిడుగులు ప‌డ‌వ‌చ్చ‌ని ఐఎండీ అధికారులు హెచ్చ‌రించారు. ఇక తెలంగాణ‌లో సైతం భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ పేర్కొంది.

Also Read : Pawan Kalyan : భారీ ర్యాలీగా ఎస్పీ ఆఫీసుకు ప‌వ‌న్

 

Leave A Reply

Your Email Id will not be published!