Mallikarjun Kharge : బెదిరించడం బీజేపీ నైజం – ఖర్గే
ఏఐసీసీ షాకింగ్ కామెంట్స్
Mallikarjun Kharge : కేంద్రంలో కొలువు తీరిన మోదీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. ఆయన సారథ్యంలో సోమవారం బెంగళూరు వేదికగా విపక్షాల కూటమి సమావేశానికి సిద్దమైంది. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం దెబ్బతింటుంటే దాన్ని కాపాడుకునేందుకు ఐక్యంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు మల్లికార్జున్ ఖర్గే.
ఒక నాయకుడు మరో పార్టీలో ఉన్నంత కాలం అవినీతి పరుడంటూ ముద్ర వేస్తారని, ఆ తర్వాత బీజేపీలో చేరి పోతే వాషింగ్ మెషీన్ లో క్లీన్ గా కొట్టుకు పోతాడంటూ సంచలన ఆరోపణలు చేశారు ఏఐసీసీ చీఫ్. అయితే బీజేపీ పనిగట్టుకుని విపక్షాలను టార్గెట్ చేస్తోందంటూ నిప్పులు చెరిగారు.
ఎప్పటి లాగే బీజేపీ బెదిరించడం, వేధించడం అలవాటుగా మారిందని మండిపడ్డారు. కానీ ఆ పార్టీ బెదిరింపులకు , వేధింపులకు తాము భయపడే ప్రసక్తి లేదని హెచ్చరించారు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge). ఇప్పటికే కర్ణాటకలో ప్రజలు చెంఫ ఛెళ్లుమనిపించారని, త్వరలో జరిగే 5 రాష్ట్రాల ఎన్నికల్లో సైతం ఇదే రిపీట్ అవుతుందని జోష్యం చెప్పారు ఏఐసీసీ చీఫ్. ఇకనైనా తన తీరు మార్చుకోవాలన్నారు.
Also Read : Heavy Rain AP Telangana : తెలుగు రాష్ట్రాలలో 3రోజులు మోస్తరు వర్షాలు
