Hardik Pandya : విండీస్ క్రికెట్ బోర్డుపై పాండ్యా ఫైర్

క‌నీస వ‌స‌తులు క‌ల్పించ‌డంలో ఫెయిల్

Hardik Pandya : టీమిండియా టి20 జ‌ట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు. ప్ర‌స్తుతం త‌న సార‌థ్యంలోని టీమ్ వెస్టిండీస్ లో ప‌ర్య‌టిస్తోంది. ఇప్ప‌టికే భార‌త్ టెస్టు, వ‌న్డే సీరీస్ గెలుచుకుంది. ఇంకా 5 టీ20 మ్యాచ్ లు ఆడాల్సి ఉండ‌గా తొలి టీ20 మ్యాచ్ ముగిసింది. భార‌త జ‌ట్టు 4 ప‌రుగుల తేడాతో విండీస్ చేతిలో ఓట‌మి పాలైంది.

Hardik Pandya Comments

మ్యాచ్ అనంత‌రం మీడియాతో మాట్లాడాడు జ‌ట్టు స్కిప్ప‌ర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya). వెస్టిండీస్ క్రికెట్ బోర్డు పై నిప్పులు చెరిగారు. తాము ల‌గ్జ‌రీస్ కోరుకోవ‌డం లేద‌ని , కేవలం క‌నీస సౌక‌ర్యాల‌ను కోరుకుంటున్నామ‌ని తెలిపాడు. త‌మ‌కు వ‌స‌తి సౌక‌ర్యాల‌ను క‌ల్పించ‌డంలో పూర్తిగా విండీస్ క్రికెట్ బోర్డు విఫ‌ల‌మైంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఇక‌నైనా ఆయా క్రికెట‌ర్ల ప‌ట్ల‌, ఇత‌ర దేశాల టూర్ కు వ‌చ్చిన స‌మ‌యంలో ఫోక‌స్ పెట్టాల‌ని సూచించాడు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ఇరు దేశాల మ‌ధ్య ఇలాంటి చిన్న చిన్న పొర‌పాట్లు మ‌రింత దూరం పెంచేలా చేస్తాయ‌ని హార్దిక్ పాండ్యా అభిప్రాయ‌ప‌డ్డాడు.

ఇదిలా ఉండ‌గా హార్దిక్ పాండ్యా విండీస్ బోర్డు నిర్వాకంపై చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర క‌ల‌క‌లం రేపాయి.

Also Read : SP Rishanth Reddy : పోలీసుల‌పై దాడి బాధాక‌రం – ఎస్పీ

Leave A Reply

Your Email Id will not be published!